Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల‌ వారికి ఆక‌స్మిక ధ‌న‌లాభం.!

ఈ రోజు (శుక్రవారం, అక్టోబర్ 11, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాలు వివరాలు...

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల‌ వారికి ఆక‌స్మిక ధ‌న‌లాభం.!

Updated On : October 10, 2024 / 4:44 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస శుద్ధ అష్టమి మ 12:06, ఉత్తరాషాఢ రాతె 5:25 శుక్రవారం ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు

మేష రాశి: పిల్లలతో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య చికాకులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి, ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త వహించాలి, అన్యదేశములయందు నివసించుట, అనవసరపు విషయముల వైపు వెళ్ల కూడదు: దత్తాత్రేయ ఆలయములు సందర్శించు కొనవలెను, మంచిఫలితములు వస్తాయి.

వృషభ రాశి: ఉద్యోగలాభం, వృత్తి వ్యాపార రంగంలో అభివృద్ధి, శరీరంలో రుగ్మతలు, అకాల భోజనము, మోకాళ్ళ యందు నొప్పులు, ప్రయాణంలో ఇబ్బందులు, సరియైన సమయంలో సరియైన నిర్ణయలు తీసుకొంటారు, విద్యారులకు అధికలాభం: శ్రీ ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయించిన ఉత్తమ ఫలితములు వస్తాయి.

మిథున రాశి: ఉద్యోగం అనుకులను, జాయింటు ద్వారా వ్యాపారంలో లాభాలు, గౌరవాభివృద్ధి, కీర్తి పరోపకార కార్యములు చేయడం, కుటుంబంలో జీవి తములో సౌఖ్యము, ఆనందము, మనోధైర్యము, ధనాదాయము బాగు ఉంటుంది. శరీర సౌఖ్యము: లలితా సహస్త్ర నామ పారాయణం చేసిన శుభం జరుగును

కర్కాటక రాశి: నూతన వ్యాపారాలు, సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకుంటారు, మంచి ఉద్యోగము రావడము, మధ్యవర్తితం మంచిది కాదు. పరోపకార కార్యములు చేయటం, ప్రయాణముల విషయంలో జాగ్రత్త అవసరము, సంతానము ద్వారం శుభవార్తలు వినడం: నవగ్రహ ఆరాధనచేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి.

సింహ రాశి:  ప్రయాణములలో ప్రమాదములు, మనోవిచారము, ప్రయత్న కార్యములు చెడిపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి, కోర్టు సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి, వ్యాపారంలో మధ్యరక లాభములు, విధ్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి:
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. 

కన్యా రాశి: ఉద్యోగం అనుకూలం, మానసిక ఆందోళనలు, కుటుంబంలో గౌరవం, వ్యాపారంలో ప్రతికూల పలితములు, ప్రతి విషయంలో అలజడులు, అకాల భోజనము, వ్యాపార విస్తరణ, బంగారం, కార్లు కొనుగోలు చేయడం, సుఖనిద్ర కలగడం: లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

తులా రాశి: కష్టాలు నష్టాలు, విందువినోదాలు, వ్యాపార విస్తరణ, సుఖనిద్ర, వాహన సౌఖ్యం, నూతన లాభములు, స్దాన చలనము, మానసిక ప్రశాంతత లేకపోవడం. ధన ఆదాయం పెరగడం, శుభవార్తలు, విదేశీయునం, ఆహార సంబంధ సమస్యలు: ఆంజనేయస్వామ ఆరాధన చేయవలను, శుభ ఫలితములు కలుగుతాయి

వృశ్చిక రాశి: నూత‌న వ్యాపార‌ములు, అనారోగ్యం, వివాదాలు. నూత‌న వ్య‌క్తుల ప‌రిచ‌యం, తీర్థ‌యాత్రలు, పుణ్య‌క్షేత్ర‌ములు, శరీర శ్ర‌మ‌, బ‌దిలీలు, అజీర్ణ బాధ‌లు, సంతానంతో విరోదం, ధ‌న లాభాలు అన్ని ప‌నులు విజ‌య‌వంతం కావ‌డం, వ్యాపారంలో లాభాలు, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆరాధ‌న చేయ‌డం వ‌ల్ల ఉత్త‌మ ఫ‌లితాలు క‌లుగుతాయి. 

ధనస్సు రాశి: ధ‌న‌స్సు.. ప్ర‌య‌త్న కార్య‌ములందు జ‌యం. ఇష్ట కార్య‌సిద్ధి. నూత‌న వ్య‌క్తుల ప‌రిచ‌య‌ము. విలువైన ఆభ‌ర‌ణాల కొనుగోలు, బంధు మిత్రుల గౌర‌వం పొంద‌డం. శ్రీ రాజ‌రాజేశ్వ‌రీ అమ్మ‌వారి ఆరాధ‌న చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు క‌లుగును. 

మకర రాశి: మ‌క‌రం.. కుటుంబ క‌ల‌హాలు, భ‌య‌ము, అనారోగ్యం, ఉద్యోగ‌, వ్యాపార విష‌యాల్లో జాగ్ర‌త్త‌.. అనారోగ్యం, ఆటంక‌ములు. శ్రీ ఆంజ‌నేయ స్వామి ఆరాధ‌న చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు క‌లుగును.

కుంభ రాశి: అజీర్ణ బాధ‌లు, సంతానంతో విరోధం, ధ‌న లాభం, వ్యాపారంలో లాభం, ప్ర‌యాణాల వ‌ల‌న ధ‌న లాభం, భ‌యం, స్థాన‌చ‌ల‌నం. న‌వ‌గ్ర‌హ ప్ర‌దిక్ష‌ణ‌లు చేయ‌డం మంచిది. 

మీనా రాశి: గౌర‌వం, స్త్రీ సుఖం, శ‌రీర సౌఖ్యం, ధ‌న లాభం, కుటుంబంలో భార్య బిడ్డ‌ల మూలంగా సుఖ‌శాంతులు క‌ల‌వు. అన్ని ప‌నులు విజ‌య‌వంతం కావ‌డం, వ్యాపారంలో లాభాలు. శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ఆరాధించ‌డం వ‌ల‌న మంచి ఫ‌లిత‌ములు.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956