Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ప్రతి పనిలో విజయం..!

ఈ రోజు (2024, నవంబర్ 23, శనివారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు... 

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ప్రతి పనిలో విజయం..!

Updated On : November 22, 2024 / 8:39 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోదినామ సంవత్సర కార్తీక మాస బహుళ అష్టమి రా:07:56, మాఘ 07:27 శనివారము
ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు

మేష రాశి: అనారోగ్యము నుంచి కోలుకోవడం, ధనాన్ని పొదుపు చేయడం, మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. కుటుంబంలో సమస్యలు, సోమరితనం, అయిష్టమైన భోజనము వ్యాపారంలో లాభములు పనులలో ఆలస్యము విధ్యారాలకు ప్రతికూల ఫలితములు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

వృషభ రాశి: ధనలాభం, ప్రతి పనిలో విజయం సాధించడం, శుభకార్య నిర్వహణ, వృత్తి, ఉద్యోగాలలో లాభం కలగడం, విజయం లభించడం శుభవార్తలు, అభివృద్ది కలగడం, స్త్రీలకు విజయం, నూతన వ్యాపారంలలో విజయం: సుందరకాండ పారాయణం చేయడం వలన శుభ ఫలితములు కలుగుతాయి.

మిధున రాశి: విదేశాలకు వెళ్లే అవకాశాలు కనపడటం, దూరపు ప్రయాణములు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం, గృహ ఉపకరణ వస్తువులు కొనడం, మంచి ఆలోచనలకు పదును పెట్టడం, గృహములో శుభకార్యక్రమములు నిర్వహించడం: ‘ఓం నమః శివాయ’ పంచాక్షరి చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

కర్కాటక రాశి: పనిలో ఆలస్యం, అధిక ఖర్చులు, కార్యరంగంలో ప్రతికూలత, శత్రు వృద్ధి, బంధుమిత్రులతో విరోధము, ప్రయాణంలో ప్రమాదములు జరగకుండా జాగ్రత్త పడాలి, అనారోగ్యము, వాయిదాలు పడుతాయి, మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి, భయము పెరుగుతుంది: శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయవలెను శుభం కలుగుతుంది.

సింహ రాశి: అనారోగ్యము, ప్రయాణములలో గొడవలు, తగాదలు, ధనము ఖర్చు, విపరీతమైన ఆందోళనలు, యాజమాన్యముతో ఇబ్బందులు, వస్తువు కొనుగోలులో తగాదలు, పనులలో ఆలస్యము, ఋణ బాధలు, విందులు వినోదములలో పాల్గోనటం, శుభాకార్యక్ర మముల నిర్వాహణ, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శన, భార్యభర్తల మధ్య చికాకులు, సంతానము ద్వారా శుభవార్తలు – శ్రీ లక్ష్మీనరసింహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

కన్యా రాశి: భార్యాభర్తల మధ్య విభేదములు, ప్రయాణముల వలన లాభములు, వాహనములు కొనుగోలు చేయడం, దూరపు ప్రయాణములు చేయడం, వస్తువులు అమ్మకాలు, కొనుగోలు చేయడం, తీర్ధయాత్రలు, విద్యార్థులకు అనుకూలము, విందు వినోదములు మాటపట్టింపు ధోరణి, బంధు మిత్రులతో వివాదములు, అనారోగ్యము కలగడం, తల్లికి అనారోగ్యము. శివ ఆరాధన వలన శుభం కలుగుతుంది.

తులా రాశి: ప్రయాణములు చేయడం, ఆకస్మిక ధనలాభం, అనుకున్న పనులు నెరవేరడం, విలువైన వస్తువులు కొనడం, రహస్య విషయములు, అనారోగ్యం, వివాహాది శుభకార్యక్రమములు చేయడం, కోపము, ఆవేశము కలగడం, విద్యపట్ల ఆసక్తి. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

వృశ్చిక రాశి: ఉద్యోగ భద్రత, విపరీతమైన ఆలోచనలు, శుభకార్య నిర్వహణ, ప్రయాణముల వలన లాభములు, వ్యాపారములో లాభములు, విదేశాలకు వెళ్లడం, ప్రమోషన్ల గృహ మరమ్మత్తులు, వాహనములు కొనడం, సరియైన నిర్ణయములు తీసుకోవాలి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన వలన శుభం కలుగుతుంది.

ధనస్సు : ఆకస్మిక ప్రయాణాల వలన లాభములు, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం, జాయింటు దారులతో అనుకూలత, ధనప్రాప్తి, వస్త్రలాభము, ఆరోగ్యము, జయము, ఎంతటి పనినైనను ధైర్యసాహసములతో చేసి విజయమును పొందుతారు, దూర ప్రాంతపు ప్రయాణములు అనుకూలించును: శ్రీ రామనామ జపం చేయండి. శుభ ఫలితములు కలుగుతాయి.

మకరం : కోర్టు వ్యవహారములు వాయిదా పడటం, దూరపు ప్రాంతములకు వెళ్లవలసివచ్చును, శుభ కార్యక్రమములకు ఆటంకములు, విద్యుత్తు పరికరములు, మిషనరీలు వాహనమలు కొనుగోలు, రావలసిన బాకీలు వసూలు చేయుట, నూతన వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేయడం: దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల సమస్యలు తొలగుతాయి

కుంభం : కుటుంబములోని వారికి ఆరోగ్యము తగ్గుతుంది, చేయు పనులయందు కష్టనష్టములు ఎదురావుతాయి, పనిలేని ప్రయాణములు, పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది, ఉద్యోగ వ్యాపారములయందు దిగువ వారి సహయములు ఉండవు: శ్రీకృష్ణ మంత్ర జపం చేయవలెను మంచి ఫలితములు కలుగుతాయి.

మీన రాశి: ఆర్థిక లాభములు, అనారోగ్యము, వృత్తి వ్యాపారములలో అధిక లాభములు, వాహనములు కొనుగోలు చేయడం, శత్రువులు మిత్రులుగా మారడం, భూలాభములు, ఇండ్లు కొనుగోలు చేయడం, స్నేహితులతో గడపటం, భార్యాభర్తల మధ్య అనుకూలత, రుణ బాధలు తగ్గడం, ఆంజనేయస్వామి ఆరాధన వలన మేలు జరుగుతుంది.

 

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956