Horoscope Today : ఈ రాశుల వారు జాగ్రత్త..! శత్రువుల భయం, ధన నష్టం..!
శత్రువులు పెరుగుతారు. మీ దగ్గర అప్పు తీసుకున్న వారు ముఖం చాటేస్తారు. వ్యతిరేక ప్రచారం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతగా కలిసిరావు.

Horoscope Today
Horoscope Today : శనైశ్చరుడు మీనంలోకి ప్రవేశించాడు. రాహువుకు అతి సమీపంలోకి వచ్చిన శని.. కొన్ని రాశులను శాసిస్తాడు, కొన్ని రాశులవారిని శపిస్తాడు! అతి బలమైన రెండు గ్రహాలు.. ఏక నక్షత్రం, ఏక పాదంపై సంచరించడం వల్ల.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వైపరీత్యాలు చోటుచేసుకుంటాయి. అయితే, వ్యక్తిగత ఫలితాల దగ్గరికి వచ్చేసరికి… గురువు అధిపతిగా ఉండే ధనుస్సు, మీన రాశులకు ఈ కలయిక మేలు చేస్తుంది. వృషభ, తుల రాశులకు శత్రుభీతిని పెంచుతుంది. కర్కాటక రాశివారికి ధన నష్టం, సింహరాశి వారికి ఆరోగ్య భంగం కలిగిస్తుంది.

Aries
మేషం: పట్టుదలకు పోతే నష్టపోతారు. పన్నెండో స్థానంలో పంచగ్రహ కూటమి వల్ల.. మనసు చంచలం అవుతుంది. నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి. ఈ పరిస్థితిని గురువు బ్యాలెన్స్ చేస్తాడు. మౌనాన్ని ఆశ్రయిస్తే పరిస్థితులు అవే సద్దుమణుగుతాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Taurus
వృషభం: ఆర్థికంగా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. క్విక్‌మనీ కోసం ఆరాటపడితే నష్టపోయే ప్రమాదం ఉంది. భూ లావాదేవీలు వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Gemini
మిథునం: ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా పెద్దగా మార్పులేం ఉండవు. ఉద్యోగంలో మాత్రం బాధ్యతలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ గుర్తింపు కూడా పొందుతారు. మీ కింద పనిచేసే వారి వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. వినాయకుడి ఆలయాన్ని దర్శించండి.

Cancer
కర్కాటకం: రుణ ప్రయత్నాలు విఫలం అవుతాయి. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల కన్నా.. అధిక ఖర్చులు ఎదురవుతాయి. కొన్నింటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఎదుటివారిని నొప్పించకూడదని మీ మనసును కష్టపెట్టుకుంటారు. శివారాధన శుభప్రదం.

Leo
సింహం: ఆరోగ్య పరంగా చికాకులు ఉంటాయి. ఔషధ సేవ అవసరం అవుతుంది. చిన్న సమస్య గురించి అతిగా ఆలోచిస్తారు. ఆర్థికంగా ఉన్నతంగా ఉంటుంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రాలు పఠించండి.

Virgo
కన్య: ఈ రోజంతా హడావుడిగా సాగిపోతుంది. పదిమందిని కలుసుకుంటారు. వర్క్‌షాప్, సెమినార్ లాంటి వాటికి హాజరవుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. రామాలయాన్ని సందర్శించండి.

Libra
తుల: శత్రువులు పెరుగుతారు. మీ దగ్గర అప్పు తీసుకున్న వారు ముఖం చాటేస్తారు. వ్యతిరేక ప్రచారం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతగా కలిసిరావు. ఆవేశంతో దగ్గరివారిని దూరం చేసుకోకండి. సంయమనం అవసరం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Scorpio
వృశ్చికం: రోజంతా ప్రశాంతంగా సాగుతుంది. ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విందులకు హాజరవుతారు. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని దర్శించండి.

Sagittarius
ధనుస్సు: కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు రూపకల్పన చేస్తారు. కుటుంబ పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. ఆరోగ్యంలో మంచి మార్పు వస్తుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.

Capricorn
మకరం: సోదరులతో వైరం ఏర్పడవచ్చు. హుందాగా వ్యవహరించడం అవసరం. ఏ విషయంలోనూ మొండిగా వ్యవహరించకండి. పట్టువిడుపుల వల్ల మేలు కలుగుతుంది. సమయపాలన పాటించడం అవసరం. కాలభైరవ స్తోత్రాలు పఠించండి.

Aquarius
కుంభం: ఇంట్లో కలహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిళ్లు ఎదరువుతాయి. మాట జారకుండా జాగ్రత్త వహించండి. ఆన్‌లైన్ లావాదేవీల్లో చికాకులు ఉంటాయి. రోజు చివరిలో ఒక శుభవార్త వింటారు. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.

Pisces
మీనం: ఒక విషయంలో బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. సోదర మూలకంగా ధనం వస్తుంది. బంధువుల రాకతో ఇంట్లో కోలాహలంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శివాలయాన్ని సందర్శించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.