Horoscope Today : ఈ రోజంతా ప్రశాంతం.. అన్ని రాశుల వారికి అన్ని శుభాలే.. గ్రహాలన్నీ మీకు సలాం కొడతాయి అంతే..!

Horoscope Today : మీనంలో పంచగ్రహ కూటమి క్రమంగా విడిపోతున్నది. ఫలితంగా.. గ్రహాలు స్వేచ్ఛగా ఫలితాలు ఇస్తాయి. దీంతో దాదాపు అన్ని రాశుల వారికీ ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది.

Horoscope Today : ఈ రోజంతా ప్రశాంతం.. అన్ని రాశుల వారికి అన్ని శుభాలే.. గ్రహాలన్నీ మీకు సలాం కొడతాయి అంతే..!

Today Horoscope

Updated On : April 3, 2025 / 9:15 PM IST

Horoscope Today : ఈ రోజు విపరీత యోగాలు లేవు, అరిష్టాలూ లేవు. మీనంలో పంచగ్రహ కూటమి క్రమంగా విడిపోతున్నది. ఫలితంగా.. గ్రహాలు స్వేచ్ఛగా ఫలితాలు ఇస్తాయి. దీంతో దాదాపు అన్ని రాశుల వారికీ ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది.

Aries

Aries

మేషం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తారు. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.

Taurus

Taurus

వృషభం: కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Gemini

Gemini

మిథునం: ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సంయమనం అవసరం. ఖర్చులు తగ్గించుకోవాలి. రాజకీయ, ప్రభుత్వ పనులలో జాప్యం ఉండవచ్చు. నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి.

Cancer

Cancer

కర్కాటకం: ప్రయాణాలు కలిసివస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కొత్తగా పరిచయం అయినవారితో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారులు భాగస్వాములతో సామరస్యంగా వ్యవహరించాలి. కనకధారా స్తోత్రం పఠించండి.

Leo

Leo

సింహం: స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కాలభైరవ అష్టకం పఠించండి.

Virgo

Virgo

కన్య: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, బంధువర్గంతో పనులు కలిసివస్తాయి. వాహనం, భూముల విషయంలో జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రామాలయాన్ని సందర్శించండి.

Libra

Libra

తుల: ఆదాయంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో అసంబద్ధ నిర్ణయాల మూలంగా ఖర్చు పెరగవచ్చు. ఆత్మీయుల సలహాతో కొన్ని పనులు నెరవేరుతాయి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

Scorpio

Scorpio

వృశ్చికం: భూముల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. పదోన్నతి మూలంగా స్థాన చలనం ఉంటుంది. వినాయకుడి గుడిని దర్శించండి.

Sagittarisu

Sagittarisu

ధనుస్సు: నలుగురి సహకారంతో తలచిన పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

Capricorn

Capricorn

మకరం: కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల మెప్పు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కుంభం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఏమైనా సమస్యలు వస్తే, వాదనకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. దత్త స్తోత్రాలు పఠించండి.

మీనం: స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. కొత్తవారితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శివారాధన మేలు చేస్తుంది.

(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)

టి. భుజంగరామ శర్మ
77022 86008

Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్‌ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.