Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయం కలుగును..!

ఈ రోజు (మంగళవారం, అక్టోబర్ 15, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయం కలుగును..!

Updated On : October 14, 2024 / 5:05 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస శుద్ధ త్రయోదశి రా 12:18, పూర్వాభాద్ర రా 10:08 మంగళవారం ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు. 

మేష రాశి: అధికలాభాలు, ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. అధికారుల మన్ననలు, ప్రతిభకు గుర్తింపు, ఉద్యోగంలో ప్రమోషన్లు, పోదుపు పాటిస్తారు, మార్పులు, భారీ మార్పులు, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం: సుందరకాండ పారాయణం వలన శుభ ఫలితములు కలుగుతాయి. 

వృషభ రాశి: ఆవేశం తగ్గించుకోవాలి, అనవసర నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం, వివాదాలు రాకుండా ఉండాలి, మంచి ఆలోచనలు, ప్రయూణముల వలన లాభములు, వ్యాపారములలో లాభములు, విధ్యార్ధులకు అనుకూలము: విష్ణుస్తోత్ర పారాయణం చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి.

మిథున రాశి: ఉద్యోగలాభం, పనులు వేగవంతంగా ఉంటాయి, చిరు వ్యాపారులకు లాభాలు, విదేశీయాన, నూతన వ్యాపారములు ప్రారంభించటం, విద్యార్థులకు అనుకూలము, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, అనవసరపు రాద్ధాంతములు, కోర్టు సమస్యలు: గకార అష్టోత్తరముతో గణపతిని ఆరాధన చేయవలెను

కర్కాటక రాశి: బంధుమిత్ర వైరములు, ఆందోళనలు, ప్రతికూలత, ప్రయాణాల వలన లాభం, వ్యాపారంలో లాభాలు, అదనపు ఆదాయం, తీర్ధయాత్రలు, పుణ్య క్షేత్ర దర్శనం, విదేశియానములో ముందంజ: లలితా అమ్మవారి ఆరా ధన వలన ఉత్తమ ఫలితములు కలుగుతాయి

సింహ రాశి: నూతన వస్త్ర లాభం, విలువైన ఆభరణాలు కొనుగోలు, కార్యముల యందు విజయం, విద్యార్థులకు అనుకూలం, స్త్రీలకు ఉన్నత భావములు, శుభకార్యములు, ప్రముఖ వ్యక్తుల కలయిక: శివ స్తోత్ర పారాయణము వలన మంచి ఫలితములు వస్తాయి.

కన్యా రాశి: నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, కుటుంబ సుఖము, ఆరోగ్యము, సమాజంలో గౌరవము, సుఖ నిద్ర, భోజన సుఖము, నూతన ఆలోచనలు, మృష్టాన్న భోజనము, నూతన ఉద్యోగ వ్యాపారములు: కనక ధారా స్తోత్ర పారాయణము వలన ఉత్తమమైన ఫలితములు కలుగుతాయి.

తులా రాశి: రోగ భయము, ఉద్యోగంలో అనుకూలం, అకాల భోజనములు కలుగును, నమ్మిన వారి వలన మోసపోవడం, స్త్రీ మూలకం, చికాకులు, వ్యాపారంలో ఇబ్బందులు, ప్రతి పనిలో విజయం,  ప్రయాణములలో ఆటంకములు: దేవి స్తోత్ర పారాయణం చేసినచో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి: అపకీర్తి, స్దాన చలనము, మానసిక ఆందోళనలు, అగౌరవము, అదికారుల ఒత్తిడి, వ్యాపారంలో జాయింటు దారుల మధ్య గోడవలు, విధ్యార్ధులకు అనుకూలము, ధన ఆదాయం పెరగడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, నవగ్రహములకు ప్రదక్షిణ చేయడం వల్ల మంచి జరుగుతుంది.

ధనస్సు రాశి: శుభవార్తలు, విందుభోజనం నూతన లాభములు, ప్రముఖ వ్యక్తుల కలయిక ద్వారా అధిక లాభములు, స్త్రీలకు ఉన్నతమైన ఆలోచనలు, విదేశీయాన ఏర్పాట్లు జరగడం, సరియైన సమయంలో సరియైన నిర్గములు తీసుకోవడం: శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన వల్ల శుభ ఫలితములు వస్తాయి.

మకర రాశి: వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, సుఖ సంతోషములు, విద్యార్థులకు అనుకూలం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన, నేత్ర సంబంధ వ్యాధులు, అన్నింటా లాభం, స్థిరాస్థుల వృద్ధి, ప్రేమ కలాపాలు, కార్యలాభము: లక్ష్మీ జపము చేసినచో ఉత్తమమైన ఫలితములు కలుగుతాయి.

కుంభ రాశి: కార్యరంగంలో ప్రతికూలత, బంధుమిత్ర, పుత్ర విరోధము, కుటుంబ సమస్యలు, వ్యాపార వృద్ధి, సుఖ సంతోషములు, శుభ కార్య నిర్వహణ, స్థిరాస్తులతో లాభం, ధనాదాయం, ప్రయాణములు: నరసింహ స్వామి వారి ఆరాధన వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

మీనా రాశి: ధననష్టం, ధనం పొదుపు పాటించాలి, మనస్పర్ధలు, స్త్రీలకు గర్భ సంబంధ అనారోగ్యం, నిద్రలేమి, అకారణ వైరము, సంఘంలో గౌరవ మర్యాదలు, ఉష్ణ సంబంద వ్యాధులు, మానసిక ఆందోళనలు: చంద్ర గ్రహ ఆరాధన వలన శుభ ఫలితములు కలుగుతాయి. 

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956