Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి ధనలాభము..!
ఈ రోజు (బుధవారం, నవంబర్ 20, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశులa ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోది నామ సంవత్సర కార్తీకమాస బహుళ పంచమి : సా.4 : 49, పునర్వసు : మ.2.50 బుధవారము
మేష రాశి: కుటుంబములో భార్యబిడ్డల మూలకంగా సుఖశాంతులు కలుగును. ప్రతి పనిని సమర్థవంతముగా నిర్వహిస్తారు, కీర్తి ప్రతిష్ఠలు దేహారోగ్యములు కలుగును. అన్యస్త్రీ పరిచయ భాగ్యములు కలుగును. లలితా దేవి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.
వృషభ రాశి: ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబములోని వారు ఆరోగ్యముగా ఉంటారు, స్త్రీలతో ప్రియ సంభాషణలు చేయుదురు. శత్రువులు మిత్రులుగా మారుతారు. విద్యావంతులు గౌరవసన్మానములు పొందుతారు, ఆరోగ్యము కుదుటపడుతుంది. కనకధార స్తోత్ర పారణయము చేసినచో మంచి ఫలితములు కలుగుతాయి.
మిధున రాశి: ధన వ్యయం, కోపము, ఆవేశము పెరగడం, తొదరపాటు నిర్ణయములు, బంధు మిత్రులతో అనుబంధం పెరగడం, ప్రయాణములలో నష్టం, సంతానము ద్వారా శుభవార్తలు. ఇష్ట దైవ ఆరాధన చేయడం వల్ల శుభం కలుగును.
కర్కాటక రాశి: అన్నింటా విజయం, అనుకూలము, ధనలాభము, ప్రమాదములు, గొడవలు రాకుండా కాపాడు కోవాలి, విలువైన ఆభరణములు కొనుగోలు చేస్తారు. విధ్యార్థులకు అనుకూలము, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
సింహ రాశి: అనుకోని ప్రయాణములు, ధననష్టము, వృథా భ్రమణం, ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నములు సఫలీకృతం కావడం, నూతన ఉద్యోగములు, నూతన వ్యాపారులు, మంచి ఆలోచనలు, గణపతి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగుతుంది.
కన్యా రాశి: ఉద్యోగంలో అనుకూలం, మానసిక ఆందోలనలు, కుటుంబంలో గౌరవం, వ్యాపార విస్తరణ, అకాల భోజనము, బంగారం, కార్లు కోనుగోలు చేయడం, సుఖనిద్ర కలగడం. లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
తులా రాశి: కష్టాలు, నష్టాలు, విందువినోదములు, వ్యాపార విస్తరణ, సుఖనిద్ర, వాహన సౌఖ్యం, నూతన లాభములు, స్థాన చలనము, మానసిక ప్రశాంతత లేకపోవడం ధన ఆదాయం పెరగడం, శుభవార్తలు, విదేశీయానం, ఆహార సంబంధ సమస్యలు, వృథా భ్రమణం. ఆంజనేయస్వామి ఆరాధన చేయవలెను, శుభ ఫలి తములు కలుగుతాయి.
వృశ్చిక రాశి: నూతన వ్యాపారములు, అనారోగ్యం, వివాదములు, నూతన వ్యక్తుల పరిచయము, పుణ్యక్షేత్రములు, శరీర శ్రమ, బదిలీలు, అజీర్ణ సమస్యలు, తీర్ధయాత్ర, ధనలాభము, అన్ని పనులు విజయవంతం కావడం, వ్యాపారాల్లో లాభములు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
ధనస్సు రాశి: నూతన వ్యాపారము, నూతన ఉద్యోగములు, శుభవార్తలు, ధనధాన్య లాభములు, ఇష్టమైన వ్యక్తుల కలయిక, వృత్తి ఉద్యోగములయందు లాభములు కలుగుతాయి. మాట పట్టింపులు, ప్రమాణములో అలసట, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం ఉత్తమం
మకర రాశి: నూతన వ్యక్తుల పరిచయం, విద్యార్థులకు అనుకూలము, ఫ్యాన్సీ, వెండి, బంగారు, నగలు, విలువైన దుస్తులు కొనుగోలు చేయడం. చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపారము అభివృద్ధి, రాణింపు ఉండును, శివసహస్రనామార్చన ఉత్తమము.
కుంభ రాశి: స్థానభ్రంశము, అన్యస్థల నివాసము, కోర్టు సమస్యలు, మోసపోవడం, కుటుంబ కలహములు, మానసిక ఆందోళనలు, పుత్రుమిత విరోధములు కలుగును, సరియైన నిర్ణయములు తీసుకోలేకపోవడం. అమ్మవారి ఆరాధనవలన మేలు కలుగును.
మీనరాశి: వ్యాపారాల్లో లాభము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రములు, నదీస్నానం, నూతన వ్యాపారములు, రుణ బాధలు తగ్గడం, విరోధములు, మోకాళ్ల నొప్పులు, ఉద్యోగంలో అనుకూలత, అనారోగ్యము. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956