Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మేలు..!
ఈ రోజు (సోమవారం, నవంబర్ 18, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోది నామ సంవత్సర కార్తీకమాస బహుళ తదియ: సా.6: 55, మృగశిర: మ 3:49, సోమవారము
మేష రాశి: ఈ రోజు మిశ్రమ ఫలితములు ఉంటాయి. అన్ని రంగాలవారు సమయానుకూలంగా నడుచుకుంటే వృత్తి వ్యాపారములలో రాణిస్తారు, మానసిక ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతోను మిత్రులతో గొడవలు, తగాదాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి – ఆదిత్యహృదయ పారాయణముతో మెరుగైన ఫలితములు కలుగుతాయి
వృషభ రాశి: ఈ రాశి వారికి పరిస్థితులు అనుకులంగా ఉంటాయి. వృత్తి వ్యాపారములలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగిపోవడం వల్ల సంతోషంగా ఉంటారు. ప్రయాణముల వల్ల లాభమలు కలుగుతాయి. తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్ర ములకు వెళ్లడం, వివాహాది శుభకార్యక్రమములకు వెళ్లడం, కుటుంబ శ్రేయస్సు కోసం పని చేస్తారు. స్వల్ప ఆనారోగ్య సమస్యలు ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయం చేస్తే మేలు.
మిధున రాశి: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారములో లాభములు, వృత్తిపరంగా ఎలాంటి ఆటంకాలు, సవాళ్లులేని ప్రశాంతమైన రోజు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారములలో పెరిగిన పోటిని సునాయసంగా అధిగమిస్తారు. విదేశాలకు వెళ్లడం, దూరప్రయాణములు లాభిస్తాయి. విదేశీయ బంధువుల నుంచి మంచి ఆదరణ శుభవార్తలు మనోబలాన్ని పెంచితుంది. – శ్రీ కనకధార స్తోత్ర పారాయణము చేయటం వల్ల శుభఫలితములు కలుగుతాయి
కర్కాటక రాశి: ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్నిరంగాల వారికి వృత్తి వ్యాపారములలో కార్యసిద్ధి, ఆర్థిక వృద్ధి కలుగుతాయి. పట్టుదల ఆత్మవిశ్వాసం ఆయుధాలుగా ఈ రోజు అన్ని పనులు అవలీలగా విజయం సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు పొందడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉండటం, ఆస్తి వ్యవహారములలో అనుకూలముగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
సింహ రాశి: ఈ రోజు మిశ్రమ ఫలితములు ఉంటాయి. పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధలు తీరిపోతాయి. వ్యాపారస్థులు సమష్టి నిర్ణయాలు తీసుకుంటారు. సానుకూల ఆలోచనలతో ఆనందంగా ఉంటారు. మీకు ఆత్మ విశ్వాసం పెరగడం మిమ్మల్ని ఉన్నతస్థానానికి తీసుకెళ్తుంది. మీవాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. శ్రీ విష్ణ/ సహస్రనామ పారాయణము వలన మేలు కలుగుతుంది.
కన్యా రాశి: ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారులలో సరైన అవకాశములు లేకపోవడంతో నిరాశతో ఉంటారు. ఆర్థిక సమస్యలతో మానసిక ప్రశాంతత కోల్పోతారు. సంతానం అభివృద్ధి సంతోషం కలిగిస్తుంది. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది, శుభకార్యక్రమములలో పాల్గొంటారు – ఈశ్వరుని ఆలయ సందర్శన మేలు చేస్తుంది.
తులా రాశి: కష్టాలు, నష్టాలు, విందువినోదములు, వ్యాపార విస్తరణ, సుఖనిద్ర వాహన సౌఖ్యం, నూతన లాభములు, స్థానచలనము, మానసిక ప్రశాంతత లేకపోవడం, ధన ఆదాయం పెరగడం, శుభవార్తలు, విదేశీయాన, ఆహార సంబంధ సమస్యలు, వృథా భ్రమణం,
ఆంజనేయస్వామి ఆరాధన చేయవలను.. శుభఫలితములు కలుగుతాయి.
వృశ్చిక రాశి: సమస్యలు ఉత్పన్నం అవడం, అధికారులతో చిక్కులు, ఆవేశం, కోపం ఎక్కువ కావడం, అనాలోచిత నిర్ణయములు, పిత్రార్జితం విషయంలో తగాధాలు, గొడవలు, కోర్టు సమస్యలు, సరియైన నిర్ణయములు తీసుకోలేకపోవడం, అభిప్రాయ భేదములు, అధిక వ్యయం, ఉన్నత చదువుల గురించి ధనము ఖర్చ కావడము, సంతోషము స్త్రీ సుఖము కలగడం అనవసరపు విష యములలో తల దూర్చకూడదు ఆంజేనేయ స్వామి ఆరాధనవలన శుభఫలిత ములు కలుగుతాయి.
ధనస్సు రాశి: ఆదాయం పెరగడం, నూతన వ్యాపారంలో ఆదాయం పెరగడం, వివాహాది శుభకార్యక్రమముల పాల్గొనడం, సంతానము ద్వారా శుభవార్తలు, విదేశాలకు వెళ్తే అవకాశములు రావడము, ప్రయూణములలో ప్రముఖ వ్యక్తులతో పరిచయములు పెరగడం. విలువైన ఆభరణములు కొనడము, దుస్తులు, వాహనములు కావడం, బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తించాలి. గురుచరిత్ర పారాయణం చేసినచో ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
మకర రాశి: వృత్తి ఉద్యోగ వ్యాపారములో అభివృద్ధి, సుఖ సంతోషములు, విద్యార్థులకు అనుకూలం, తీర్థయాత్రలు, నేత్ర సంబంధ వ్యాధులు, అన్నింటా లాభం, తీర్థయాత్రలు, స్థిరాస్థుల వృద్ధి, ప్రేమ కలాపాలు, కార్యలాభము. లక్ష్మీజపము చేసినచో ఉత్తమైనన ఫలిత ములు కలుగుతాయి.
కుంభ రాశి: కార్యరంగంలో ప్రతికూలత, బంధు మిత్రపుత్ర విరోధము, కుటుంబ సమస్యలు, వృథా భ్రమణం, వ్యాపారవృద్ధి సుఖసంతోష ములు, శుభకార్య నిర్వహణ, స్థిరాస్తులలో లాభం, ధనాదాయం, ప్రయాణములు. నరసింహస్వామి వారి ఆరాధనవల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మీన రాశి: నూతన ఆలోచనలు, వృత్తి ఉద్యోగము చికాకులు, పనులలో ఆలస్యము, దైవకార్యక్రమమలు, లేనిపోని అపోహలు, భాగస్వామ్య వ్యాపారులు కలసి రావడం. ఉన్నత చదువు దూరప్రయాణములు, వివాహములలో పాల్గొనటం. స్థలములు కొనుగోలు చేయడం, అనారోగ్య కారణంగా అధికవ్యయం, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడం, నూతన ఆలోచనల ద్వారా ధనము సంపాదించండం. గణపతి దేవాలయ దర్శనము చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956