Meena Rashi Ugadi Rasi Phalalu 2025 : మీన రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి.

Meena Rashi Ugadi Rasi Phalalu 2025 : మీన రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..

Pisces

Updated On : March 30, 2025 / 1:21 AM IST

Meena Rashi Ugadi Rasi Phalalu 2025 : కొత్త ఆశలతో అడుగుపెట్టిన ఉగాది.. కొన్ని రాశుల వారిని ఆర్థికంగా అనుగ్రహిస్తే, మరికొన్ని రాశుల వారి యశస్సు పెంచనుంది. త్రిగ్రహ, చాతుర్‌ గ్రహ, పంచగ్రహ కూటములు అన్ని రాశుల వారినీ ఎంతో కొంత చికాకు పెడతాయి. ముఖ్యంగా మేష రాశికి ఏల్నాటి శని ప్రారంభం అవుతున్నది. సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని చికాకులు తెప్పిస్తుంది.

అయితే, ఈ మూడు రాశులకూ రాహు, కేతువులు అండగా నిలవనున్నారు. మేషరాశికి లాభ రాహువు, ధనుస్సు రాశికి సప్తమ గురువు, సింహరాశికి లాభ గురువు ఉండటం వల్ల.. శని వల్ల కలిగే ఆటంకాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టవు. ఈ మూడు రాశుల వారూ నిత్యం హనుమాన్‌ చాలీసా పఠించడం మంచిది. శక్తి మేరకు అనాథలకు దాన ధర్మాలు చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.

మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం: 5 వ్యయం: 5
రాజపూజ్యం: 3 అవమానం: 1
చైత్రం: గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. కొన్ని విషయాలలో అనుకూలత, కొన్నిం-టిలో ప్రతికూలత ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు
సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మేర లాభాలు పొందలేకపోతారు.
వైశాఖం: ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టి కార్య నిర్వహణపై మనసు నిలపాలి. ఆస్తి వ్యవహారాల్లో బంధువర్గంతో
వివాదాలు తలెత్తుతాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి.
జ్యేష్ఠం: ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు పొందుతారు. కొత్త పనులు వాయిదా పడతాయి. కోర్టు కేసులతో ఇబ్బందులు
ఉంటాయి. విద్యార్థులకు శ్రమ అధికం అవుతుంది.
ఆషాఢం: సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపు-తారు. సంఘంలో గౌరవ, ప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనం వల్ల ఖర్చులు
ఉంటాయి. ఆత్మీయులు, స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి.
శ్రావణం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభి-స్తుంది. కుటుంబ పెద్దల సహకారం పొదుతారు. శుభకార్య ప్రయత్నాలు
ఫలి-స్తాయి. అందరి సహకారంతో పనులు నెరవేరుతాయి.
భాద్రపదం: ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. ప్రారంభించిన పనులు నిరాటంకంగా
పూర్తవు-తాయి. ఆత్మీయులతో సంతోషంగా ఉంటారు. అధికారుల ప్రశంసలు అందు-కుంటారు.
ఆశ్వయుజం: ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. సమ-యానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. అందరితో స్నే హంగా ఉంటూ,
పనులు పూర్తి చేసుకుంటారు. భూ వ్యవహారం లాభిస్తుంది.
కార్తికం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తుల మూలంగా రావలసిన డబ్బు అందుతుంది. బంధుమిత్రుల సహకారం
లభిస్తుంది. పరపతి పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు.
మార్గశిరం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డబ్బు విషయంలో జాగ్రత్త
అవసరం. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. ఉద్యోగులకు పని-భారం పెరుగుతుంది. పెద్దల సూచనలు పాటించడం అవసరం.
పుష్యం: ప్రారంభించిన పనులలో జాప్యం ఉంటుంది. స్నేహితులతో మాటప-ట్టింపులు తలెత్తుతాయి. నెల చివరిలో వృత్తి, వ్యాపారాల్లో అనుకూల
పరిస్థితులు ఏర్పడతాయి. లాభాలు పొందుతారు.
మాఘం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం
కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి.
ఫాల్గుణం: ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంయమనంతో
పనులు చేస్తారు. ప్రయాణాలతో కార్యసిద్ధి పొందుతారు.