ఈ వారం రాశిఫలాలు (నవంబర్ 2 నుంచి 8 వరకు).. ఈ రాశివారు విలువైన ఆభరణాలు కొంటారు.. లక్కు మామూలుగా లేదు పో..

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

ఈ వారం రాశిఫలాలు (నవంబర్ 2 నుంచి 8 వరకు).. ఈ రాశివారు విలువైన ఆభరణాలు కొంటారు.. లక్కు మామూలుగా లేదు పో..

Rasi Phalalu

Updated On : November 1, 2025 / 9:31 PM IST

ఈ వారం రాశిఫలాలు (నవంబర్ 2 నుంచి 8 వరకు)

గురువు కర్కాటక రాశిలో శని మీన రాశిలో
వక్రస్థితి రాహుకేతువులు కుంభ సింహరాశులలో
రవి శుక్రులు తులా రాశిలో
కుజ బుధులు వృశ్చికంలో
చంద్రుడు కుంభం,
మీనం, మేషం వృషభ రాశులలో సంచారం

మేషం: అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఆర్థికంగా బాగుపడుతారు. మీ మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఎక్కువగా క్రీడలలో పాల్గొంటారు. కుటుంబం కోసం పోరాడతారు. మీ భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. సుదర్శన కవచము చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభం: ఉద్యోగ అవకాశములు, ప్రముఖ వ్యక్తులతో పరిచయములు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అధిక ప్రయాణములు, అధిక ఖర్చులు పెరగడం, మీ భాగస్వామికి బాగా సపోర్ట్‌గా నిలుస్తారు. నూతన వ్యాపార అవకాశములు, విద్యార్థులకు అనుకూలం. సుందర కాండ పారాయణం వలన శుభం కలుగుతుంది.

మిధున రాశి: ఆరోగ్యం కుదుట పడుతుంది, మీరు ఊహించలేని లాభములు కలుగుతాయి, మీరు ఎనర్జీ గా పని చేస్తారు. స్నేహితులత్రో బంధువులతో కలసిమెలసి పని చేస్తారు, కొన్ని చికాకులు కూడా కలుగుతాయి, బాగస్వామ మీ మధ్య చిన్న చిన్న గోడవలు వస్తాయి. ప్రయాణముల వలన లాభములు కలుగుతాయి, ఆర్ధిక స్థితిగతులు మెరుగు పడుతాయి, కుబేరుడిని ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి: ఆర్థిక పరంగా నష్టం కలుగుతుంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ పొదుపు పాటించాలి, మీరు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. కుటుంబంలో మనః శాంతి కలుగుతుంది, మీ భాగస్వామి మీతో ఎప్పుడు లేని విధంగా మీతో ప్రేమతో ఉంటారు. విలువైన ఆభరణములు కొనుగోలు చేస్తారు. శివారాధన వల్ల శుభం కలుగుతుంది

సింహ రాశి: ఇంట్లో శుభకార్యక్రమాలు, విలువైన బహుమతులు, అవార్డులు అందుకుంటారు. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభములు కలుగుతాయి, మీ ఇంటికి బందువులు రావడం, కొన్ని విషయములలో ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామితో గోడవలు వస్తాయి, మానసిక ప్రశాంతత అవసరము. గురు చరిత్ర పారాయణమ చేస్తే శుభం కలుగుతుంది.

కన్యా రాశి: రుణబాధలు తగ్గుతాయి, ఉద్యోగ వ్యాపారంలో గౌరవం పెరగడం, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. చెడు ఆలోచనలు మానుకోవడం మంచిది. వైవాహిక జీవితంపై జాగ్రత్త అవసరము.. ఒకరి పై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ప్రయాణాలలో లాభములు కలుగుతాయి, భాధ్యతలు పెరుగుతాయి. ఇష్టదైవ ఆరాధన చేస్తే శుభం కలుగుతుంది.

తులా రాశి: ఆర్థిక పరంగా లాభాలు పొందడం, మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు, కష్టపడి పనిచేస్తారు. ప్రశంసలు అందుకుంటారు, దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది జాగ్రత్త వహించండి, ప్రశాంతమైన వాతావరణాన్నీ కల్పించుకోవాలి. మంచి ఫలితముల కోసం ఏకాగ్రత అలవర్చుకోవాలి, నూతన వ్యాపారములలో లాభములు కలుగుతాయి విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

వృశ్చిక రాశి: ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి, కుటుంబ సభ్యుల మద్దతు అవసరం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు సలహాలు తీసుకోవాలి. ప్రేమలో నిరాశకు గురవుతారు, పొదుపు పాటించాలి. వ్యాపారం ముందుకు సాగుతుంది, కోర్టు సమస్యలు వస్తాయి. ఇష్ట దైవ ఆరాధన వల్ల శుభఫలితములు కలుగుతాయి.

ధనస్సు రాశి: ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి. అన్నదమ్ములు, అక్కా చెల్లెల్ల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది, భార్య భర్త ల మధ్య అనుబంధం పెరగడం, ఉద్యోగ వ్యాపారములలో లాభములు, నూతన వస్త్రప్రాప్తి, విలువైన ఆభరణములు పెరగడం, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల ఉత్తమ ఫలితములు వస్తాయి.

Also Read: రాహు దోషము తొలగాలంటే.. అష్టకష్టాలు, మీకున్న ఆపదలు తొలిగి సుఖశాంతులతో ఉండాలంటే ఇలా చేయండి..

మకర రాశి: ఆరోగ్యం కుదుటపడుతుంది, ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది, శుభవార్తలు వింటారు. భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు, మీ భాగస్వామితో అన్ని విషయములు పంచుకుంటారు. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. గణపతిని గకార అష్టోత్తరతో పూజ చేసిన శుభ ఫలితములు కలుగుతుంది.

కుంభ రాశి: కొత్తగా ఆలోచిస్తారు, ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. ఒత్తిడికి గురికావడం, కుటుంబ బాధ్యతలు నెత్తి మీద వేసుకుంటారు. ప్రేమ వ్యవహారములలో విజయం సాధించండం, ఉద్యోగంలో భద్రత అవసరం, నూతన వ్యాపారములలో ముందంజ, రుణబాధలు తొలగుతాయి, అమ్మవారి ఆరాధన వలన శుభ ఫలితములు కలుగుతాయి.

మీన రాశి: సరైన సమయంలో సరైన నిర్ణయము తీసుకుంటారు. సమయం వృథా చేసుకోకుండా అవసరమైన పనులపై దృష్టి సారించడం మంచిది. ఇతరులతో గొడవలు పడొద్దు. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో సమస్యలు వస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల శుభం జరుగుతుంది.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956