Daily 3GB డేటా : BSNL 365 Days ప్లాన్ రీఎంట్రీ

BSNL ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్. దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ ప్రవేశపెట్టింది. ఇతర టెలికం కంపెనీలతో పోటీగా BSNL ప్రీపెయిడ్ ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఎట్రాక్టీవ్ ఆఫర్లను అందిస్తోంది. కస్టమర్ల బడ్జెట్ కు తగినట్టుగా రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లను ప్రవేశపెడుతోంది.
గతంలో బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన రూ.1,999 ఏడాది ప్రీమియంతో అదే ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ తీసుకొచ్చింది. ఇప్పుడు రూ.1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. 365 రోజుల కాలపరిమితితో BSNL తమ యూజర్లకు ఆఫర్ చేస్తున్నట్టు టెలికం టాక్ రిపోర్టు తెలిపింది.
ఈ ఏడాది ప్లాన్ తీసుకున్న యూజర్లకు 250 నిమిషాల డెయిలీ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. ముంబై, ఢిల్లీ సర్కిళ్లలో కూడా ఈ ఆఫర్ అందిస్తోంది. 250 నిమిషాలు దాటిన తర్వాత బేస్ టారిఫ్ ప్లాన్ ప్రకారం యూజర్లకు ఛార్జ్ చేస్తుంది. ఇందులో నేషనల్ రోమింగ్ ప్లాన్ కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఇక ఇంటర్నెట్ విషయానికి వస్తే.. ప్రతిరోజు 3GB వరకు డేటా పొందవచ్చు. FUP లిమిట్ దాటిన తర్వాత కూడా యూజర్లు అన్ లిమిటెడ్ డౌన్ లోడ్స్ కొనసాగించవచ్చు. కానీ, డేటా స్పీడ్ 80Kbpsకు పడిపోతుంది. మరోవైపు మొబైల్ ఫోన్ కాలింగ్, డేటా బెనిఫెట్స్ తో పాటు యూజర్లు ఒక ఏడాది విలువైన SonyLIV సబ్ స్ర్కిప్షన్, ఉచితంగా PRBT (కాలర్ రింగ్ బ్యాక్ టోన్స్) కూడా పొందవచ్చు.
Read Also : డిసెంబర్ 2 నుంచి సేల్ : 55 అంగుళాల Xiaomi Mi TV 4K వచ్చేసింది