ప్లీజ్ చెక్: ఈ క్రెడిట్, డెబిట్ కార్డులు ఇక పని చేయవు

2019, జనవరి 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు పని చేయవు. అవును నిజమే. స్వయంగా బ్యాంకులే ఈ విషయాన్ని తెలిపాయి. అయితే పాతకార్డులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

  • Published By: sreehari ,Published On : December 31, 2018 / 05:50 AM IST
ప్లీజ్ చెక్: ఈ క్రెడిట్, డెబిట్ కార్డులు ఇక పని చేయవు

2019, జనవరి 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు పని చేయవు. అవును నిజమే. స్వయంగా బ్యాంకులే ఈ విషయాన్ని తెలిపాయి. అయితే పాతకార్డులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

2019, జనవరి 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు పని చేయవు. అవును నిజమే. స్వయంగా బ్యాంకులే ఈ విషయాన్ని తెలిపాయి. అయితే పాతకార్డులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వివరాల్లోకి వెళితే.. అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు హై సెక్యూరిటీ ఫీచర్స్‌తో కూడిన కొత్త క్రెడిట్, డెబిట్ కార్డులు ఇస్తున్నాయి. ఈఎంవీ చిప్‌, పిన్‌ ఆధారిత కార్డులు అందిస్తున్నాయి. జనవరి 1 నుంచి ఈ కార్డుల ద్వారా మాత్రమే ఏటీఎంల నుంచి నగదు డ్రా చేయడానికి, పేమెంట్లు, కొనుగోళ్లు చేయడానికి అవకాశం ఉంటుంది.

స్కిమ్మింగ్‌ ద్వారా సైబర్‌ దొంగలు తేలిగ్గా డేటా దొంగిలించేందుకు అవకాశం ఉన్న పాత కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్‌, పిన్‌ ఆధారిత కార్డులు జారీ చేయాలని ఆర్‌బీఐ 2015, ఆగస్టు 27నే ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31లోగా కొత్త చిప్‌, పిన్‌ ఆధారిత కార్డులు జారీ చేయాలని స్పష్టం చేసింది. దీనిపై బ్యాంకులు ఖాతాదారులకు మెసేజ్‌లు పంపాయి. డిసెంబర్ 31 లోగా ఖాతాదారులందరూ తమ కార్డులు రీప్లేస్ చేసుకోవాలని బ్యాంకులు ఆదేశాలు ఇచ్చాయి. ఇప్పటికే చాలామంది తమ కార్డుల్ని మార్చుకున్నారు. అయితే ఇంకా కార్డు మార్చుకోవాల్సిన వాళ్లు ఉన్నారు.

కొత్త కార్డులు తీసుకోవడానికి అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే ఇస్తారు. కార్డు ముందు వైపు గోల్డెన్ చిప్ ఉంటే అది ఈఎంవీ కార్డు. ఇప్పటికే మీ దగ్గర అలాంటి కార్డు ఉంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కార్డుపై చిప్ లేకపోతే నేరుగా మీ హోం బ్రాంచ్‌కు వెళ్లి కార్డు రీప్లేస్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో కూడా కార్డు రీప్లేస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.