ప్రీమియం 1600CC హర్లే డెవిడ్‌సన్ బైక్ ధరలు తగ్గుతున్నాయి!

  • Published By: sreehari ,Published On : February 24, 2020 / 07:38 AM IST
ప్రీమియం 1600CC హర్లే డెవిడ్‌సన్ బైక్ ధరలు తగ్గుతున్నాయి!

Updated On : February 24, 2020 / 7:38 AM IST

హర్లే డెవిడ్సన్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. హర్లే డెవిడ్సన్ బైక్ ధరలు తగ్గనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ 30 గంటల పాటు మాత్రమే ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన భారత్-అమెరికా దేశాల మధ్య పలు ఒప్పందాలపై చర్చించనున్నారు. ఇరుదేశాల మధ్య జరుగబోయే కీలక ఒప్పందాల్లో హర్లే డేవిడ్ సన్ మోటార్ సైకిళ్లపై ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు.

భారత టారిఫ్ పాలసీలపై ఎప్పటినుంచో ట్రంప్ తరచూగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. అమెరికాకు చెందిన మ్యానిఫాక్చరర్ మోటార్ సైకిల్స్ సంస్థ హర్లే డెవిడ్ సన్ ఉత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాన్ని విధించింది. మోడీని కలిసిన ప్రతిసారి చాలా సందర్భాల్లో ట్రంప్ దీనిపై ప్రస్తావించేవారు. అయినప్పటికీ ఇప్పటివరకూ భారత్ టారిఫ్ పాలసీల ఎత్తివేత్తపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా సింగిల్ డిజిట్ 1600cc మోటార్ సైకిళ్లు ఆపై మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో భారతీయ అధికారులు ఉన్నట్టు ఓ నివేదిక తెలిపింది. తద్వారా దేశంలో రానురాను హర్లే డెవిడ్ సన్ ఉత్పత్తులు మరింత చౌకగా లభ్యమయ్యే అవకాశం ఉంది.

అందిన రిపోర్టుల ప్రకారం.. ప్రీమియం మోటార్ సైకిళ్లపై (కంప్లీట్లీ బుల్ట్ యూనిట్స్-CBU) దిగుమతి సుంకాన్ని పూర్తిగా తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలిపాయి. గతంలో ఒకానొక సందర్భంలో ఇదే ఉత్పత్తులపై 100 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ట్రంప్ ఫోన్ ద్వారా మోడీని కోరారు. 

దాంతో 2019లో కంప్లీట్లీ బుల్ట్ యూనిట్స్ (CBU)లపై 50శాతం మేర తగ్గించింది. అమెరికన్ కంపెనీ హార్లే డెవిడ్ సన్ సంస్థను 1903లో స్థాపించారు. 2009లో భారత్ లో మోటార్ సైకిళ్ల తయారీ మొదలైంది. అప్పట్లో 25వేల మోటార్ సైకిళ్లను విక్రయించింది. ప్రీమియం 750+CC కేటగిరీలో ఇప్పుడు 33 డీలర్లకు ఇది ఊతమివ్వనుంది. భారత్ లో మొత్తం 17 మోడళ్లపై ఆఫర్ అందించనుంది. హార్లే డెవిడ్ సన్ మోటార్ సైకిల్స్ ప్రారంభ ధర మార్కెట్లో రూ.5.33 లక్షల నుంచి రూ.50 లక్షల రేంజ్ లో ఉన్నాయి.