Gold Rate: ఓర్నాయనో.. మళ్లీ లకారం దాటిన బంగారం.. దడ పుట్టిస్తున్న వెండి.. ఒక్కరోజులోనే భారీగా పెరుగుదల

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..

Gold Rate: ఓర్నాయనో.. మళ్లీ లకారం దాటిన బంగారం.. దడ పుట్టిస్తున్న వెండి.. ఒక్కరోజులోనే భారీగా పెరుగుదల

Gold Rate

Updated On : July 19, 2025 / 1:18 PM IST

Gold Rate: బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. రోజురోజుకు గోల్డ్ రేటు పెరుగుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో భారత దేశంలో బంగారం, వెండిని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంటుంది.

 

శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.660 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.600 పెరిగింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో తులం గోల్డ్ రేటు ఏకంగా రూ. వెయ్యికిపైగా పెరిగింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు బంగారం పది డాలర్లు పెరిగి.. ప్రస్తుతం 3,350 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వెండి ధరసైతం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. శనివారం కిలో వెండి రూ.2,100 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.91,700కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,00,040కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,850కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,00,190 కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.91,700 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 1,01,040కు చేరింది

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,26,000 కు చేరుకుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,16,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,26,00కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.