Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ తగ్గాయ్.. క్రమంగా పడిపోతున్న గోల్డ్ రేటు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతో తెలుసా..
గోల్డ్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

Gold Rate
Gold Rate Today: భారత్ లో బంగారానికి ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు పండుగలు, వేడుకలు, ఇతర శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలుకు అధిక ప్రాధాన్యతనిస్తారు.. అయితే, గత కొంతకాలంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతుంది.
ప్రపంచ వాణిజ్య యుద్ధం తగ్గుముఖం పట్టడం, బంగారం వంటి సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ తగ్గడం వల్ల గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతోందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంగళవారం బంగారం ధరతోపాటు వెండి ధర కూడా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 450 తగ్గగా.. 24 క్యారట్ల బంగారంపై రూ.490 తగ్గింది. మరోవైపు వెండిధర సైతం తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు ధర 12డాలర్లు తగ్గి 3,217 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.87,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,020 వద్దకు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,250 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,170కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 87,100 కాగా.. 24క్యారెట్ల ధర రూ.95,020కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.97,000 కు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.