Gold Rate: శివరాత్రి రోజు గుడ్ న్యూస్.. పండుగ చేసుకోండి.. తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణల్లో ఏయే సిటీల్లో ఎంత రేటుందో చెక్..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర..

Gold
Gold And Silver Price: అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. దీంతో సరికొత్త రికార్డులను గోల్డ్ ధర నమోదు చేస్తుంది. అయితే, బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా తగ్గింది.
మహాశివరాత్రి పర్వదినం వేళ బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 270 తగ్గింది. మరోవైపు వెండి ధర రూ. 2వేలు తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.80,500కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ.87,820 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,650 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,970గా నమోదైంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 80,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.87,820 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 2వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,06,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.98,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,06,000గా నమోదైంది.