Gold Rate: గోల్డ్ రేటు భారీగా తగ్గబోతుందా..? హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి బంగారం ధర ఎంతో తెలుసా..
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర ..

Gold
Gold And Silver Price: పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతేకాదు.. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ మంచి సాధనం. అయితే, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో వారం క్రితం వరకు గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. తద్వారా గోల్డ్ ధర సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే, గత నాలుగు రోజుల నుంచి బంగారం ధర తగ్గుముఖం పట్టింది. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై సుమారు రూ.1400 మేర తగ్గింది.
గోల్డ్ ధర ఇంకా తగ్గుతుందా..?
మెక్సికో, కెనడా ఉత్పత్తులపై మార్చి 4న సుంకాలు పెరగనున్నాయని ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలో ద్రవ్యోల్బనం రేటు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చుననే వార్తలు వస్తున్నాయి. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Fed) అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచొచ్చునని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ ధరల తగ్గుదల తాత్కాలికమేనని మరికొందరు నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ఔన్సు ధరలో 2,810 యూఎస్డీల వద్ద గట్టి మద్దతు లభిస్తుంది. ఈ స్థాయి నుంచి తిరిగి పుంజుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 2,810 స్థాయిని కోల్పోయి.. 2,732 స్థాయి వరకు పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేజరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ, పెరుగుదలను చూస్తే ఔన్సు ధర 2,914 స్థాయి వద్ద నిలకడగా ఉంటుంది.. ఆ స్థాయిని దాటితే బంగారం రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో గోల్డ్ రేట్లు మార్చి నెలలో ఏ స్థాయికి చేరుతుంది.. ఎంత తగ్గుతుందనేది వేచి చూడాల్సిందే.
ఇవాళ స్థిరంగా..
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 86,620 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారట్ల గోల్డ్ రేటు రూ.79,400 వద్ద కొనసాగుతుంది. ఇదిలాఉంటే వెండి ధరలోనూ ఇవాళ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలను ఓసారి తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.79,400కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ.86,620 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,770గా నమోదైంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 79,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.86,620 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,05,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.97,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,05,000గా నమోదైంది.