Gold Rate: బాబోయ్ గోల్డ్ కొంటున్నారా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం ధర ఎంతో తెలుసా.. 24క్యారట్ల 10గ్రాముల..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర ..

Gold Rate: బాబోయ్ గోల్డ్ కొంటున్నారా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం ధర ఎంతో తెలుసా.. 24క్యారట్ల 10గ్రాముల..

Gold

Updated On : March 8, 2025 / 10:21 AM IST

Gold and Silver Prices Today: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు బ్యాడ్ న్యూస్. వరుసగా రెండోరోజులు తగ్గిన బంగారం రేటు.. మళ్లీ భారీగా పెరిగింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.

Gold

అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 2,907డాలర్లు ఉండగా.. శనివారం ఉదయం నాలుగు డాలర్లు పెరిగి 2,911 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ రేటు 32.55 డాలర్లుగా ఉంది.

Gold

భారతదేశంలో శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 550 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 500 పెరిగింది. అయితే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం..

Gold

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.80,400 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,710.

Gold

దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,860గా నమోదైంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ. 80,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.87,710 వద్ద కొనసాగుతుంది.

Gold

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,100 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.99,100 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,100గా నమోదైంది.