Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ...

Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?

Gold

Gold And Silver Price : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పెండ్లి అంటే బంగారం కొనుగోళ్లు తప్పనిసరిగా ఉంటాయి. దీంతో బంగారం దుకాణాలు రద్దీగా మారుతున్నాయి. అయితే, బంగారం కొనుగోలు చేసేవారికి ఓ శుభవార్త. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరసైతం స్వల్పంగా తగ్గింది.

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,830 వద్ద కొనసాగుతుంది.

 

  • దేశంలోని ప్రధాన నగరాల్లో..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,740 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,980 వద్దకు చేరింది.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,590 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,830 వద్ద కొనసాగుతుంది.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,090 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,370 వద్దకు చేరింది.

 

  • తగ్గిన వెండి ధర ..
    దేశవ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 76,900 గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 76,900కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.75,400కు చేరింది. బెంగళూరులో మాత్రం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో అక్కడ. కిలో వెండి ధర రూ.72,850 వద్దకు చేరింది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.