Gold Rate Today : పసిడి కొనుగోలుదారులకు శుభవార్త .. వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ఎంతంటే?
వరుసగా మూడోరోజు బంగారం ధర తగ్గింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ...

Gold
Today Gold and Silver Rate : మీరు బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే మీకు శుభవార్తే. వరుసగా మూడోరోజు బంగారం ధర తగ్గింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 90 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 100 తగ్గింది. వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 600 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,450 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 60,490 కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 60,640.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,490 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,900 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.60,980కు చేరింది.
వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 600 తగ్గింది. దీంతో మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 75,400కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,400. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.72,400 కు చేరింది. బెంగళూరులో వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో అక్కడ కిలో వెండి రూ.71,750 వద్ద కొనసాగుతోంది.