Gold Rate : పసిడి ప్రియులకు షాక్.. ఏపీ, తెలంగాణాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ...
![Gold Rate : పసిడి ప్రియులకు షాక్.. ఏపీ, తెలంగాణాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.. Gold Rate : పసిడి ప్రియులకు షాక్.. ఏపీ, తెలంగాణాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2024/06/Gold-And-Silver-Price-Today-9.jpg)
Gold And Silver Price Today
Gold And Silver Price Today : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 660 పెరగ్గా.. 22 క్యారెట్ల గోల్డ్ పై రూ. 600 పెరిగింది. అయితే, ఆదివారం వీటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలోనూ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే…
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,550. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,650 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,700.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,500 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,550.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,050 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,150.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా ఆదివారం వెండి ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 95,600.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ.95,600.
కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.91,000.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 90,300 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.