Gold Rate : తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. మళ్లీ రూ.లక్షకు చేరువైన వెండి ధర..

తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold Rate : తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. మళ్లీ రూ.లక్షకు చేరువైన వెండి ధర..

Gold

Gold And Silver Price Today : బంగారం, వెండి ధరలు మళ్లీ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. శనివారం 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 710 పెరిగింది. మరోవైపు వారం రోజులుగా వెండి ధర పెరుగుతూనే ఉంది. ఇవాళసైతం కిలో వెండిపై రూ. 1600 పెరిగింది. గడిచిన వారం రోజుల్లో కిలో వెండిపై సుమారు రూ.5వేలు పెరిగింది. దీంతో తాజాగా కిలో వెండి ధర రూ. లక్షకు చేరువైంది. భారీగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

 

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,650కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,800.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,800 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,950.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,650 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,800.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,200 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,400కు చేరింది.

 

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శనివారం వెండి ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 99,300.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.99,300.
కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.94,800.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 93,250 వద్ద కొనసాగుతుంది.

 

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.