బంగారం స్వల్పంగా.. వెండి కూడా అదే బాటలో

ఇండియన్ మార్కెట్లో స్వల్పంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. చైనాలో వైరస్ భారత మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుంది. దీంతో ధరలో కాస్త మార్పు కనిపించి 0.52శాతానికి పడిపోవడంతో 10గ్రాముల బంగారం ధర రూ.40వేల 75లకు చేరింది. ఇదిలా ఉంటే వెండి ధరల్లోనూ పతనం కనిపిస్తుంది. 0.4శాతానికి తగ్గి కేజీ రూ.46వేల 177కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారానికి లాభాలు కనిపించేట్లుగానే ఉంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లలో మార్పులు కనిపించకపోవడంతో అమెరికన్ డాలర్ పతనం అయింది. ఇదే పరిస్థితుల్లో గోల్డ్ రూ.40వేల 500వద్ద అవరోధం కనిపిస్తోంది. వెండి.. రూ.46వేల 100నుంచి రూ.46వేల 500మధ్య తటపటాయిస్తోంది.
ఈ వారంతంలో రాబోయే సెలవులు.. వినియోగదారుల నుంచి బంగారం డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా, సింగపూర్ లలో న్యూ ఇయర్ సెలబ్రేషన్లు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా రాబడతాయని నిపుణుల అంచనా.