మళ్లీ పెరుగుతోంది : పైపైకి..బంగారం ధరలు

మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. పై పైకి ఎగబాకుతోంది. కొద్ది రోజులుగా ధరలు దిగి ఉండడంతో పసిడి ప్రియులు బంగారం కొనడానికి మెగ్గు చూపారు. ఇదంతా డిమాండ్ తగ్గిపోవడమే కారణమని వ్యాపార నిపుణులు వెల్లడించారు. అయితే..అనూహ్యంగా..అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో బులియన్ మార్కెట్‌లో 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.
మళ్లీ రూ. 39 వేలకు చేరుకోవడంతో బంగారం కొనుక్కోవడానికి వస్తున్న వారు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. వెండి కూడా అదే దారిలో వెళుతోంది. ఒక్కరోజే రూ. 943 పెరిగి..కేజీ వెండి ధర రూ. 47 వేల 146కు చేరుకుది. పండుగల సీజన్ వస్తుండడంతో ధరలు పెరగడానికి కారణమంటున్నారు. బంగారం, వెండి ధరలు ఇలాగే కంటిన్యూ అవకాశాలున్నాయని అంటున్నారు. దేశంలోని ఇతర నగరాల్లో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి.
నగరం | 24 క్యారెట్ | 22 క్యారెట్ |
చెన్నై | రూ. 38, 333 | రూ. 36, 473 |
ముంబై | రూ. 39, 077 | రూ. 37, 217 |
బెంగళూరు | రూ. 37, 493 | రూ. 35, 733 |
ఢిల్లీ | రూ. 39, 067 | రూ. 37, 227 |
హైదరాబాద్ | రూ. 38, 321 | రూ. 36, 461 |