Gold prices: 11 నెలల కనిష్ఠానికి బంగారం ధ‌ర‌లు

గ్లోబ‌ల్ మార్కెట్‌లో ప‌సిడి ధరలు 11 నెలల కనిష్ఠానికి చేరాయి. అమెరికా డాలర్ విలువ రోజురోజుకీ పెరిగిపోతుండ‌డం బంగారం ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.349 గ్రాములు) బంగారం ధ‌ర 1.5 శాతం త‌గ్గి 1,710 డాల‌ర్ల‌ (రూ.1,36,590)కు చేరింది. అలాగే, వెండి ధ‌ర ఔన్సుకు 2.2 శాతం త‌గ్గి 18.76 డాల‌ర్ల (రూ.1,498.50)కు దిగజారింది. భార‌త్‌లో బంగారం ధ‌ర ఎంసీఎక్స్‌లో 1 శాతం త‌గ్గి 10 గ్రాముల ధ‌ర‌ రూ.50,281గా ఉంది.

Gold prices: 11 నెలల కనిష్ఠానికి బంగారం ధ‌ర‌లు

Gold Price

Updated On : July 15, 2022 / 8:30 AM IST

Gold prices: గ్లోబ‌ల్ మార్కెట్‌లో ప‌సిడి ధరలు 11 నెలల కనిష్ఠానికి చేరాయి. అమెరికా డాలర్ విలువ రోజురోజుకీ పెరిగిపోతుండ‌డం బంగారం ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.349 గ్రాములు) బంగారం ధ‌ర 1.5 శాతం త‌గ్గి 1,710 డాల‌ర్ల‌ (రూ.1,36,590)కు చేరింది. అలాగే, వెండి ధ‌ర ఔన్సుకు 2.2 శాతం త‌గ్గి 18.76 డాల‌ర్ల (రూ.1,498.50)కు దిగజారింది. భార‌త్‌లో బంగారం ధ‌ర ఎంసీఎక్స్‌లో 1 శాతం త‌గ్గి 10 గ్రాముల ధ‌ర‌ రూ.50,281గా ఉంది.

Maharashtra: పెట్రోల్‌పై లీట‌రుకు రూ.5 వ్యాట్ త‌గ్గించిన మ‌హారాష్ట్ర కొత్త సీఎం షిండే

అలాగే, వెండి ధ‌ర 3.5 శాతం త‌గ్గి కిలో ధ‌ర రూ.55,194కి చేరింది. దిగుమతి సుంకం పెంచ‌డంతో ఈ నెల మొద‌ట్లో భార‌త్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.52,300కి పెరిగిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ, గ్లోబ‌ల్ మార్కెట్ల స్థాయి అంత‌టి త‌క్కువ‌ ధరలు భార‌త్‌లో లేవు. మ‌రోవైపు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ళ వ‌ల్ల అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు పెంచే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Lancet study: మ‌ద్యం వ‌ల్ల 15 నుంచి 39 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సు వారికి తీవ్ర‌ ముప్పు

ఈ నెల 26, 27న విధాన‌ప‌ర నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి స‌మావేశం నిర్వ‌హించి ఈ మేర‌కు ప్రకటన చేసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. జూన్‌లో అమెరికా వార్షిక ద్రవ్యోల్బణం రేటు 9.1 శాతానికి చేరింది. ఊహించిన దానికంటే గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్ వ్య‌వ‌స్థ కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది. దీంతో బంగారం ధరలు మరింత‌ తగ్గే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.