రంగోలి స్టాంప్స్ కావాలా? : Diwali స్టాంప్స్ స్కీమ్ పొడిగించిన Google Pay 

  • Published By: sreehari ,Published On : November 4, 2019 / 10:19 AM IST
రంగోలి స్టాంప్స్ కావాలా? : Diwali స్టాంప్స్ స్కీమ్ పొడిగించిన Google Pay 

Updated On : November 4, 2019 / 10:19 AM IST

మీరు గూగుల్ పే వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్. గూగుల్ పే.. తమ యూజర్లను ఆకర్షించేందుకు Diwali స్కీమ్ మళ్లీ పొడిగించింది. పండుగ సీజన్ సందర్భంగా యూజర్ల కోసం ప్రత్యేకించి ప్రవేశపెట్టిన Diwali Stamps ఆఫర్లను నవంబర్ 11 వరకు పొడిగిస్తున్నట్టు గూగుల్ పే ప్రకటించింది. దివాళి కంటెస్ట్ లో భాగంగా రంగోలి స్టాంప్స్ గెలుచుకునే అవకాశాన్ని తమ యూజర్లకు కల్పిస్తోంది. గూగుల్ పే అందించే అన్ని ఐదు దివాళి స్టాంపులను యూజర్లు తెచ్చుకుంటే వారికి రూ.251 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 

అందులో Diya, Flower, Lantern, Jhumka, Rangoli స్టాంపులు కావాలి. రూ.251 క్యాష్ బ్యాక్ లేదా రూ.లక్ష వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. అయితే చాలామంది యూజర్లు తమ అకౌంట్లో రంగోలి స్టాంప్స్ సేకరించేందుకు తెగ కష్టపడిపోతుంటారు. ఎక్కువ శాతం మందికి దివాళి స్టాంపుల్లో రంగోలి మాత్రం అంత తొందరగా రావడం లేదు. మొత్తం ఐదు స్టాంపులు కలెక్ట్ చేస్తేనే ఏదైనా గిఫ్ట్ పొందవచ్చు. గూగుల్ పే ద్వారా రూ.35 లేదా ఆపై ట్రాన్సాక్షన్ చేసిన యూజర్లకు మాత్రమే దివాళి స్టాంపులు వస్తాయి. అంతేకాదు.. DTH, బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జ్ చేయడం ద్వారా కూడా Diwali స్టాంపులు సంపాదించుకోవచ్చు. 

ఏదొక స్టాంపు కావాలన్నా.. ఇతరులకు Gift లేదా Request ద్వారా పంపినా కూడా అవసరమైన స్టాంపులను తెచ్చుకోవచ్చు. మరొకటి ఆండ్రాయిడ్ యూజర్లకు Diwali Scanner అనే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీ ఫోన్ స్కానర్ ద్వారా యూజర్లు దివాళి స్టాంపులను స్కాన్ చేసి స్టాంపులను తెచ్చుకోవచ్చు. గూగుల్ పే యూజర్లు రోజుకు ఐదు స్టాంపులను కలెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ పే ద్వారా ఎవరైతే ఎక్కువగా ట్రాన్సాక్షన్లు చేస్తారో వారికి ర్యాండమ్ గా స్టాంపులను అందిస్తోంది. ఎన్ని పేమెంట్స్ చేస్తే అన్ని స్టాంపులను సంపాదించుకోవచ్చు.