చెట్టినాడ్ గ్రూపు కంపెనీలపై ఆదాయపన్ను శాఖ దాడులు

  • Published By: murthy ,Published On : December 9, 2020 / 01:52 PM IST
చెట్టినాడ్ గ్రూపు కంపెనీలపై ఆదాయపన్ను శాఖ దాడులు

Updated On : December 9, 2020 / 2:25 PM IST

Income tax raids in chettinad group : తమిళనాడుకు చెందిన చెట్టినాడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేస్తున్నారు. చెన్నై ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ముంబై తో పాటు 50 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి, దాదాపు 100 టీమ్స్ తో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

చెట్టినాడ్ గ్రూప్ పై చెన్నైలో సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెట్టినాడ్ సంస్ధ సిమెంట్, పవర్, స్టీల్, బొగ్గు , మెడికల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్లు, ట్రాన్స్ పోర్టు, సెక్యూరిటీ వంటి పలు రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది. చెట్టినాడ్ చైర్మన్ ముత్తయ్య నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలోనూ ఏటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 2015లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.