9నెలల తర్వాత…4శాతం పెరిగిన మారుతీ ప్రొడక్షన్

మారుతీ సుజుకీ ఇండియా(MSI) నవంబర్ లో తన ఉత్పత్తిని 4.33శాతం పెంచింది. డిమాండ్ తగ్గిపోవడంతో వరుసగా తొమ్మిది నెలల నుంచి ఉత్పత్తి తగ్గించిన మారుతీ నవంబర్ లో 4.33శాతం ఉత్పత్తి పెంచింది. నవంబర్ లో మొత్తం 1లక్షా 41వేల 834 యూనిట్లను కంపెనీ ఉత్పత్తి చేసింది. గతేడాది ఇదే నెలలో కంపెనీ ఉత్పత్తి చేసిన 1లక్షా 35వేల 946 యూనిట్ల కన్నా ఇది అధికమని రెగ్యూలేటరీ ఫైలింగ్ లో కంపెనీ తెలిపింది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి గత నెలలో 1లక్షా 39వేల 84 యూనిట్లు ఉండగా,2018 నవంబర్ లో ఈ సంఖ్య 1లక్షా 34వేల 149 ఉందని,3.67శాతం పెరుగుదల ఉందని కంపెనీ తెలిపింది.
మినీ,కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లు, ఆల్టో,న్యూ వేగాన్ ఆర్,సెలీరియో,ఐగ్నిస్,స్విఫ్ట్,బలీనో,డిజైర్ ల ఉత్పత్తి ఈ ఏడాది నవంబర్ లో 24వేల 52 యూనిట్లు ఉత్పత్తి ఉండగా,గతేడాది నవంబర్ లో 30వేల 129 యూనిట్ల ఉత్పత్తి ఉంది.20.16 శాతం ఉత్పత్తి వీటిలో తగ్గింది. అయితే వితర బ్రీజా,ఎర్టిగా అండ్ ఎస్ క్రాస్ వంటి యుటిలిటీ(వినియోగ)వెహికల్స్ ఉత్పత్తి మాత్రం 18శాతం పెరిగింది. ఏడాది క్రితం వీటి ఉత్పత్తి 23వేల 38 యూనిట్లు ఉండగా ఇప్పుడు 27వేల 187 యూనిట్లకు చేరుకుంది.