Maruti Suzuki Car Discounts : మార్చిలో మారుతి సుజుకి మోడళ్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ మోడల్ కారు ధర ఎంతంటే?
Maruti Suzuki Car Discounts : భారత మార్కెట్లో అతిపెద్ద ప్యాసింజర్ వెహికల్ (PV) తయారీదారు, మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) తమ కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Maruti Suzuki Car Discounts _ Brezza, Ertiga, WagonR, Swift, Alto K10 _ Discounts up to Rs 64K in March, Full Details
Maruti Suzuki Car Discounts : భారత మార్కెట్లో అతిపెద్ద ప్యాసింజర్ వెహికల్ (PV) తయారీదారు, మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) తమ కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అరేనా రిటైల్ ఛానెల్ ద్వారా విక్రయించే పాపులర్ మోడళ్లపై మార్చిలో అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది.
అరేనా షోరూమ్‌లలో అందుబాటులో ఉన్న కార్లలో ఆల్టో (Alto), ఆల్టో K10 (Alto K10), S-ప్రెస్సో, వ్యాగన్R, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా ఉన్నాయి. మార్చిలో ఈ మారుతి డిస్కౌంట్లు, ఆఫర్లను పొందవచ్చు. మారుతి సుజుకి (Alto)పై రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బోనస్, దాదాపు రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ సహా మొత్తం రూ. 38వేల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.
మారుతి సుజుకి Alto K10, మారుతి సుజుకి S-ప్రెస్సోపై రూ. 30వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4వేల కార్పొరేట్ డిస్కౌంట్ మొత్తం విలువ రూ. 49వేలకి చేరుకుంది. కంపెనీ బెస్ట్ సెల్లర్, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ విషయానికి వస్తే.. కొనుగోలుదారులు రూ. 40వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 20వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Maruti Suzuki Car Discounts _ Brezza, Ertiga, WagonR, Swift, Alto K10
క్యుములేటివ్ వ్యాగన్ఆర్ డిస్కౌంట్లు రూ. 64వేల వరకు అందించనుంది. మరో స్టార్ పెర్ఫార్మర్, మారుతి సుజుకి స్విఫ్ట్ (Swift), రూ. 30వేల నగదు డిస్కౌంట్, రూ. 20వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4వేల కార్పొరేట్ డిస్కౌంట్ సహా మొత్తం రూ. 54వేల వరకు డిస్కౌంట్లను కలిగి ఉంది.
కంపెనీ మారుతి సుజుకి సెలెరియోపై రూ. 25వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4వేల కార్పొరేట్ డిస్కౌంట్‌తో రూ.44వేల వరకు మొత్తం డిస్కౌంట్లను అందిస్తోంది. మారుతి సుజుకి డిజైర్‌కి కేవలం రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్ మాత్రమే ఉంది. మరోవైపు, మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి బ్రెజ్జాపై ఎలాంటి డిస్కౌంట్ లేదని గమనించాలి.