Largest selling car: దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న కారు ఏది? టాప్-10లో ఏయే కార్లు ఉన్నాయి?
మారుతి సుజుకీ స్విఫ్ట్ మోడల్ కార్లు గత నెల 17,896 యూనిట్లు అమ్ముడుపోయాయి.

Maruti Suzuki Swift
Largest selling car – Maruti Suzuki Swift: దేశంలో కార్లకు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది జులైలో 3,52,492 కార్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే నెలలో 3,41,971 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది జులైలో కంటే ఇప్పుడు 3.1 శాతం అమ్మకాలు పెరిగాయి.
గత నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్-10 కార్లలో మారుతి సుజుకీకి చెందిన మోడల్సే ఎనిమిది ఉన్నాయి. అగ్రస్థానంలో మారుతి సుజుకీ స్విఫ్ట్ నిలిచి మరోసారి దుమ్మురేపింది. మారుతి సుజుకీ స్విఫ్ట్ మోడల్ కార్లు గత నెల 17,896 యూనిట్లు అమ్ముడుపోయాయి.
రెండు, మూడో స్థానాల్లో మారుతి సుజుకీ బాలెనో (16,725 యూనిట్లు), మారుతి సుజుకీ బ్రెజా (16,543 యూనిట్లు) ఉన్నాయి. 5వ స్థానంలో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఉంది. హ్యుందాయ్ క్రెటా – 14,062 యూనిట్లు అమ్ముడుపోయింది.
అత్యధికంగా అమ్ముడైన కార్లు (టాప్-10)
* మారుతి సుజుకీ స్విఫ్ట్ – 17,896 యూనిట్లు
* మారుతి సుజుకీ బాలెనో – 16,725 యూనిట్లు
* మారుతి సుజుకీ బ్రెజా – 16,543 యూనిట్లు
* మారుతీ సుజుకి ఎర్టిగా – 14,352 యూనిట్లు
* హ్యుందాయ్ క్రెటా – 14,062 యూనిట్లు
* మారుతి సుజుకీ డిజైర్ – 13,395 యూనిట్లు
* మారుతి సుజుకి ఫ్రాంక్స్ – 13,220 యూనిట్లు
* మారుతి సుజుకి వ్యాగనార్ – 12,970 యూనిట్లు
* టాటా నెక్సాన్ – 12,349 యూనిట్లు
* మారుతి సుజుకీ ఈకో – 12,037 యూనిట్లు