Royal Enfield Himalayan Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వచ్చేస్తోంది.. నవంబర్ 7నే లాంచ్.. టెక్నికల్ స్పెషిఫికేషన్లు ఇవే..!
Royal Enfield Himalayan Bike : 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధర సుమారు రూ. 2.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుందని అంచనా. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ టెక్నికల్ స్పెషిఫికేషన్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

New Royal Enfield Himalayan Bike _ Check technical specifications here
Royal Enfield Himalayan Bike : కొత్త బుల్లెట్ 350ని లాంచ్ చేసిన తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త 452సీసీ హిమాలయన్ పాత 411సీసీ హిమాలయన్ స్థానంలో రానుంది. ఈ కొత్త హిమాలయన్ నవంబరు 7న ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
అంతకంటే ముందుగానే ఈ బైక్ టెక్నికల్ ఫీచర్లు వెల్లడయ్యాయి. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మరింత శక్తివంతమైన, 452cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, DOHC, EFI ఇంజిన్‌ను కలిగి ఉంది. 40పీఎస్ గరిష్ట శక్తిని, 40ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 2023 అవతార్‌లో, మోటార్‌సైకిల్ ట్విన్-స్పార్ ట్యూబ్యులర్ ఫ్రేమ్‌పై ఆధారపడింది.
డ్యూయల్ ఛానల్ ABS ఆప్షన్ :
ఇందులో యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్ (200ఎమ్ఎమ్ వీల్ ట్రావెల్) వెనుకవైపు మోనోషాక్ (200ఎమ్ఎమ్ వీల్ ట్రావెల్) ఉన్నాయి. ముందువైపు 21 అంగుళాల వీల్, వెనుకవైపు 17 అంగుళాల వీల్ ఉన్నాయి. ముందు (320మి.మీ) బ్యాక్ (270 మి.మీ) ఒక్కో డిస్క్ ఉంది. రైడర్లు స్విచ్ చేయగల డ్యూయల్-ఛానల్ ABS ఆప్షన్ పొందవచ్చు.

New Royal Enfield Himalayan Bike
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ పొడవు 2,245 మిమీ, వెడల్పు 852 మిమీ, ఎత్తు 1,316 మిమీ. 1,510మిమీ. వీల్‌బేస్, 230మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. సీటు ఎత్తు కోసం రెండు ఆప్షన్లలో ఉన్నాయి. అందులో 805మిమీ, 825మిమీ. 90శాతం ఇంధనం, ఆయిల్‌తోకూడిన మోటార్‌సైకిల్ కర్బ్ బరువు 196 కిలోలు ఉంటుంది. ఇంధన ట్యాంక్ 17-లీటర్ సామర్థ్యం కలిగి ఉంది.
హిమాయలన్ ధర (అంచనా) :
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 2023 ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్ ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త ఫుల్-డిజిటల్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధర సుమారు రూ. 2.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుత మోడల్ ధర రూ. 2.16 లక్షల నుంచి రూ. 2.28 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు.