Ola New Scooters Launch : ఓలా గిగ్, S1 Z రేంజ్ స్కూటర్లు వచ్చేశాయి.. భారత్‌లో ఏ మోడల్ ధర ఎంతంటే?
Ola New Scooters Launch : ఓలా ఎలక్ట్రిక్ నుంచి గిగ్ S1 Z సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఓలా కొత్త ఈవీ స్కూటర్లలో గిగ్, గిగ్ ప్లస్, ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్ సహా మోడల్‌లు ఉన్నాయి.

Ola Gig, S1 Z range of scooters launched in India
Ola New Scooters Launch : ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ నుంచి గిగ్ S1 Z సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఓలా కొత్త ఈవీ స్కూటర్లలో గిగ్, గిగ్ ప్లస్, ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్ సహా మోడల్‌లు వరుసగా రూ. 39,999, రూ. 49,999, రూ. 59,999, రూ. 64,999 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఓలా కొత్త ఈవీ స్కూటర్ బుకింగ్‌లు ఇప్పుడు కేవలం రూ. 499కి ఓపెన్ అయ్యాయి. గిగ్, ఎస్1 జెడ్ కోసం డెలివరీలు వరుసగా ఏప్రిల్ 2025, మే 2025లో ప్రారంభం కానున్నాయి.
ఓలా గిగ్ :
ఓలా గిగ్ స్కూటర్ ప్రత్యేకంగా తక్కువ ప్రయాణాలను నిర్వహించే గిగ్ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించింది. మన్నికైన డిజైన్, వైడబుల్ రేంజ్, రిమూవబుల్ బ్యాటరీ, తగినంత పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఐడీసీ-సర్టిఫైడ్ పరిధి 112 కి.మీ, గంటకు 25 కి.మీ గరిష్ట వేగంతో స్కూటర్‌లో రిమూవబుల్ 1.5kWh బ్యాటరీ, హబ్ మోటార్, 12-అంగుళాల టైర్‌లు ఉన్నాయి. ఈ ఓలా స్కూటర్ల ప్రారంభ ధర రూ. 39,999, ఓలా గిగ్ బి2బి కొనుగోళ్లు, అద్దెలకు అందుబాటులో ఉంది.
ఓలా గిగ్ ప్లస్ :
ఎక్కువ దూరం ప్రయాణించే భారీ పేలోడ్‌లను మోసే గిగ్ వర్కర్ల కోసం ఓలా గిగ్+ స్కూటర్ రూపొందించింది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కి.మీ. రిమూవబుల్ సింగిల్ లేదా డ్యూయల్ బ్యాటరీని కలిగి ఉంది. ప్రతి ఒక్కటి 1.5kWh వద్ద రేట్ అయింది. ఐడీసీ-వెరిఫైడ్ 81 కి.మీ పరిధిని అందిస్తోంది (డ్యూయల్ బ్యాటరీలతో 157 కి.మీ). 1.5kW గరిష్ట అవుట్‌పుట్‌ను అందించే హబ్ మోటార్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 49,999, ఓలా గిగ్+ బీ2బీ కొనుగోళ్లు, అద్దెలకు అందుబాటులో ఉంది.
ఓలా S1 జెడ్ :
ఓలా ఎస్1 జెడ్ అనేది పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించిన పర్సనల్ ఎలక్ట్రిక్ స్కూటర్. రిమూవబుల్ డ్యూయల్ 1.5kWh బ్యాటరీలను కలిగి ఉంది. ఐడీసీ-సర్టిఫైడ్ పరిధిని 75కి.మీ (డ్యూయల్ బ్యాటరీలతో 146 కి.మీ) అందిస్తోంది. గంటకు 70 కి.మీ గరిష్ట వేగంతో 2.9kW హబ్ మోటార్‌తో పవర్ పొందుతుంది. 1.8 సెకన్లలో గంటకు 0 నుంచి 20కి.మీ, 4.8 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అదనపు ఫీచర్లలో ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఫిజికల్ కీ ఉన్నాయి. ఈ ఓలా ఎస్1 జెడ్ ప్రారంభ ధర రూ. 59,999కు అందిస్తుంది.
ఓలా ఎస్1 జెడ్ ప్లస్ :
ఓలా ఎస్1 జెడ్ ప్లస్ అనేది పర్సనల్, తేలికపాటి వాణిజ్య ఉపయోగం కోసం రూపొందించిన డ్యూయల్-పర్పస్ ఎలక్ట్రిక్ స్కూటర్. రిమూవబుల్ డ్యూయల్ 1.5 kWh బ్యాటరీలతో అమర్చి ఉంటుంది. 75కి.మీ (డ్యూయల్ బ్యాటరీలతో 146కి.మీ ) గంటకు 70కి.మీ గరిష్ట వేగంతో ఐడీసీ-సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. 14-అంగుళాల టైర్లు, ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఫిజికల్ కీ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. 2.9kW హబ్ మోటార్‌తో నడిచే ఈ స్కూటర్ 1.8 సెకన్లలో గంటకు 0 నుంచి 20కి.మీ, 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 40కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఓలా ఎస్1 జెడ్+ ప్రారంభ ధర రూ. 64,999 ఉంటుంది.
ఓలా గిగ్, ఓలా ఎస్1 జెడ్ రేంజ్ లాంచ్‌తో పాటు ఓలా ఎలక్ట్రిక్ ఓలా పవర్‌పాడ్ ప్రవేశపెట్టింది. పవర్‌పాడ్ ఇ-స్కూటర్‌ల పోర్టబుల్ బ్యాటరీలను ఇన్వర్టర్‌లుగా పని చేసేందుకు అనుమతిస్తుంది. కానీ, హోం అప్లియన్సెస్‌కు సపోర్టు చేయదు. ఓలా ప్రకారం.. సింగిల్ 1.5kWh బ్యాటరీ ప్యాక్ 5 ఎల్ఈడీ బల్బులు, 3 సీలింగ్ ఫ్యాన్లు, ఒక టీవీ, మొబైల్ ఛార్జర్, వై-ఫై రూటర్ 3 గంటల వరకు విద్యుత్ సరఫరా అందించగలదు.
Read Also : iPhone 17 Pro Models : స్పెషల్ కెమెరా ఫీచర్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మోడల్స్.. ఇంకా ఏమి ఉండొచ్చుంటే?