భారీగా పెరుగనున్న బంగారం ధర

బంగారం ధర భారీగా పెరిగే అవకాశముంది. రానున్న రోజుల్లో పసిడి పరుగు తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 03:06 AM IST
భారీగా పెరుగనున్న బంగారం ధర

Updated On : October 30, 2019 / 3:06 AM IST

బంగారం ధర భారీగా పెరిగే అవకాశముంది. రానున్న రోజుల్లో పసిడి పరుగు తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం ధర భారీగా పెరిగే అవకాశముంది. రానున్న రోజుల్లో పసిడి పరుగు తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు నెలల్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.42 వేలు చేరొచ్చని అంటున్నారు. భౌగోళిక రాజకీయ అస్థిరతలు, ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తూ వెళ్లడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం వంటి పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ చివరకు 10 గ్రాముల బంగారం ధర రూ.42 వేల స్థాయికి చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.

మధ్య ప్రాచ్య ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితులు కొనసాగవచ్చని దీంతో రానున్న రోజుల్లో కామెక్స్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,650 డాలర్లకు చేరొచ్చని కామ్‌ట్రెండ్జ్ రీసెర్చ్ కోఫౌండర్, సీఈవో జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. ఎంసీఎక్స్ మార్కెట్‌లో రూ.42,000లకు పెరగొచ్చని చెప్పారు. బంగారం ధర ఈ ఏడాది బుల్లిష్‌గానే ఉండొచ్చని ఆయన తెలిపారు. కేంద్ర బ్యాంకులు బంగారం కొంటూ వెళ్లడం కూడా ఇందుకు దోహదపడొచ్చని అంటున్నారు.

అలాగే ఈక్విటీస్‌లో ఇయర్ ఎండ్ స్కైరఫ్‌లు కూడా బంగారం డిమాండ్ పెరగటానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.37వేల 900 సమీపంలో, కామెక్స్‌లో ఔన్స్‌కు 1,494 డాలర్ల సమీపంలో ఉంది. దేశీ ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర రూ.36వేల 800 నుంచి రూ.39వేల 400 స్థాయిలో కదలాడవచ్చని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీస్ హెడ్ రవీంద్ర రావు తెలిపారు. అదే గ్లోబల్ మార్కెట్‌లో ధర ఔన్స్‌కు 1460 నుంచి 1530 డాలర్ల మధ్యలో కదలాడవచ్చని వెల్లడించారు.

ఈ ఏడాది బంగారం మంచి రాబడిని అందించిందని, ధర ఏకంగా 15 శాతం మేర పెరిగిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ రీసెర్చ్) నవ్‌నీత్ దమానీ తెలిపారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి 1.4 శాతం పడిపోవడం కూడా పసిడి పరుగుకు కలిసొచ్చిందన్నారు. భవిష్యత్‌లోనూ బంగారం ధర పరుగులు పెట్టొచ్చని ఆయన అంచనా వేశారు. వాణిజ్య ఉద్రిక్తతలు కొంత మేర తగ్గడం వల్ల బంగారం ధరలో కొద్దిగా కరెక్షన్ ఉండొచ్చని, అయితే ధర మాత్రం బుల్లిష్‌గానే ఉంటుందని అంచాన వేశారు. ఈ ఏడాది చివరకు బంగారం ధర రూ.39వేల 500 స్థాయికి చేరొచ్చని తెలిపారు.