Redmi Note 13 Series : రెడ్‌మి నోట్ 13 సిరీస్ ఫీచర్లు లీక్.. వచ్చే జనవరి 5నే లాంచ్.. పూర్తి వివరాలివే..!

Redmi Note 13 Series Specifications : రెడ్‌మి నోట్ 13 5జీలో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్, 108ఎంపీ ప్రధాన కెమెరా ఉంటాయి.

Redmi Note 13 Series : రెడ్‌మి నోట్ 13 సిరీస్ ఫీచర్లు లీక్.. వచ్చే జనవరి 5నే లాంచ్.. పూర్తి వివరాలివే..!

Redmi Note 13 Series specifications leaked online

Updated On : December 24, 2023 / 7:41 PM IST

Redmi Note 13 Series Specifications : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ మిడ్-రేంజ్ రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ కానున్నట్టు కంపెనీ ధృవీకరించింది. అయితే, ఈ ఫోన్ భారతీయ లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ సుధాన్షు అంబోర్ రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ భారతీయ, గ్లోబల్ వేరియంట్‌లకు పూర్తి స్పెషిఫికేషన్లను రివీల్ చేశారు.

రెడ్‌మి నోట్ 13 5జీ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ వనిల్లా వేరియంట్ 2400*1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని లీక్ స్పెసిఫికేషన్‌లు చూపిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు. ప్రాసెసర్ పరంగా.. మిడ్-రేంజ్ ఫోన్ 6ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

Read Also : Redmi Note 13 Pro Price : భారత్‌కు రెడ్‌మి నోట్ 13 ప్రో వచ్చేస్తోంది.. వచ్చే జనవరి 4న లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

అన్ని గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో వస్తుందని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్ 108ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.

Redmi Note 13 Series specifications leaked online

Redmi Note 13 Series specifications 

రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ :
రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ 4ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ద్వారా అందిస్తుంది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం అడ్రినో 710 జీపీయూ ఆధారంగా వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్ 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో కూడా వస్తుందని భావిస్తున్నారు.

రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు :
హై-ఎండ్ ఫోన్ రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ ఫోన్ మాలి-జీ610 ఎంసీ4 జీపీయూతో వచ్చిన మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌తో అందిస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్ వేరియంట్‌లలో 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ వేరియంట్‌లో రావచ్చు.

Read Also : Flipkart Winter Fest : ఫ్లిప్‌కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లపై సగానికి పైగా డిస్కౌంట్.. డోంట్ మిస్!