మళ్లీ పైపైకి : మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

  • Published By: madhu ,Published On : February 28, 2019 / 04:08 AM IST
మళ్లీ పైపైకి : మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Updated On : February 28, 2019 / 4:08 AM IST

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. రోజూవారి ధరల మార్పు విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి అడ్డు అదుపు లేకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్ 7 పైసలు, డీజిల్ 8 పైసలు చొప్పున పెరిగాయి. ఈ ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవని సామాన్య జనాలు బెంబేలెత్తుతున్నారు. పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని నగరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.73లు ఉండగా డీజిల్ ధర రూ.67లుగా ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.36, డీజిల్ ధర 70.18 రూపాయలుగా ఉంది. తెలంగాణ రాజథాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు ధర రూ.76.12గా ఉంది. డీజిల్ అయితే లీటర్ కు 72.85రూపాయలకు చేరుకుంది. 
 

నగరం  పెట్రోల్ డీజిల్
ఢిల్లీ రూ. 71.73 రూ. 67.00
కోల్ కతా రూ. 73.82 రూ. 68.79
ముంబై రూ. 77.36 రూ. 70.18
చెన్నై రూ. 74.48 రూ. 70.81
బెంగళూరు రూ. 74.11 రూ. 69.22
హైదరాబాద్ రూ. 76.12 రూ. 72.85
కృష్ణా రూ. 76.15 రూ. 72.46
విశాఖపట్టణం రూ. 74.99 రూ.71.33