రూ.13,990 మాత్రమే : Triple కెమెరాలతో Vivo Y19 ఫోన్

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో ఇండియా నుంచి కొత్త Y సిరీస్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లలోకి వచ్చేసింది. అదే.. Vivo Y19 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి. రూ.13వేల 990లకే లభ్యమ్యే ఈ ఫోన్ ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. గ్రేడియంట్ ఫినీష్ తో వచ్చిన ఈ వివో వై19 ఫోన్.. ఒక వేరియంట్ (4GB RAM + 64 ఇంటర్నల్ స్టోరేజీ)తో లభ్యమవుతోంది. వివో Y5s మాదిరిగా చైనాలో వివో Y19 ఫోన్ సేల్స్ మొదలయ్యాయి.
ఈ రెండు ఫోన్లలో స్ర్కీన్, కెమెరాలు, హార్డ్ వేర్, బ్యాటరీలు ఒకేలా ఉన్నాయి. 6.53 అంగుళాల IPS LCD డిస్‌ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, టాల్ అస్పెక్ట్ రేషియో స్ర్కీన్, 5,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ లో ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ సింగిల్ సెన్సార్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మల్టీ-టర్బో, గేమ్ స్పేస్ సపోర్ట్ చేసేలా ఉంది.
ఇక రియర్ ప్యానెల్ ఫీచర్లలో 16MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వివో వై19లో రియర్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఎఐ ఆధారిత ఫేస్ అన్ లాక్ సపోర్ట్ చేస్తుంది. ఫుల్ HD+రెజుల్యుషన్ 1080×2340 ఫిక్సల్స్ స్ర్కీన్, అస్పెక్ట్ రేషియో 19:5:9తో ఉంది. 90.3శాతం బాడీ రేషియో ఆఫర్ చేస్తోంది. మీడియా టెక్ హెలియో పీ65 చిప్ సెట్ సామర్థ్యంలో హార్డ్ వేర్ సపోర్ట్ తో రన్ అవుతుంది.
స్టోరేజీ పెంచుకునేందుకు వీలుగా మైక్రోSD కార్డు సపోర్ట్ కూడా ఉంది. సాఫ్ట్ వేర్ FunTouch OS 9.2 UI ఆధారిత ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్ రన్ అవుతుంది. భవిష్యత్తులో ఈ ఓఎస్ ఆండ్రాయిడ్ 10కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చో లేదో అనేది క్లారిటీ లేదు.