మతం మార్చుకోనందుకు ప్రియురాలిని, ఆమె కుమార్తెను హత్య చేసిన ప్రియుడు

ముంబై పోలీసులు జులై 14న వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక ఇంటి నుంచి రెండు అస్ధి పంజరాలను స్వాధీనం చేసుకున్నారు. విచారించగా మతం మార్చుకోనందుకు ప్రియురాలిని, ఆమె కుమార్తెను ప్రియుడు దారుణంగా హత్య చేసి ఇంట్లో పూడ్చి పెట్టినట్లు తెలిసింది. ఆ ఇంటిలో సుమారు నాలుగు నెలలుగా నివసిస్తున్నాడు. తప్పించుకు పారిపోయిన ప్రియుడి కోసం ముంబై పోలీసులు గాలిస్తున్నారు.
బీహార్ కు చెందని షంషాద్ ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఐదేళ్ళ క్రితం సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్ లో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. మహిళతో పరిచయం ఏర్పడిన కొత్తల్లో షంషాద్ తను ముస్లింను అనే సంగతి దాచి పెట్టి ఆమెతో స్నేహం కొనసాగించాడు. కొన్నాళ్లకు నిజం చెప్పి ఆమెతో కలిసి సహజీవనం చేయటం ప్రారంభించాడు.
ఆ మహిళకు మొదటి వివాహం ద్వారా 10 సంవత్సరాల కుమార్తె ఉంది. ముగ్గురు కలిసి పార్తాపూర్ ప్రాంతంలో నాలుగేళ్లుగా కలిసి నివసిస్తున్నారు. కాగా… గత ఏడాది కాలంగా షంషాద్ ఆ మహిళను మతం మార్చుకోమని ఒత్తిడి చేస్తున్నాడు. అందుకు ఆ మహిళ నిరాకరించింది.
మార్చి 28 న ఇద్దరి మధ్య ఈ విషయమై ఇద్దరిమధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశంలో షంషాద్ తన ప్రియురాలిని ఆమె కుమార్తెను హత్య చేసాడు. శవాలను ఎలా మాయం చేయాలో అర్దంకాలేదు. ఇంట్లోనే గొయ్యి తవ్వి పూడ్చిపెట్టాడు.
అప్పుడే దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న రోజులు. ఎవరూ ఇళ్ళనుంచి బయటకు రావటం లేదు. దాంతో మహిళ గురించి కూడా ఇరుగు పొరుగు వారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమె స్నేహితురాలికి ఇటీవల అనుమానం వచ్చింది.
మార్చి 28 నుంచి, అంటే సుమారు 4 నెలలుగా తన స్నేహితురాలి నుంచి ఫోన్ కాల్, కానీ ఆమె క్షేమ సమాచారాలు తెలియకపోవటంతో పోలీసు స్టేషన్ లో కనపడుట లేదు అని ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన చిరునామా, ఫోటోల ఆధారంగా పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు.
పోలీసులు రావటం గమనించిన షంషాద్ తప్పించుకు పారిపోయాడు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు ఒక చోట ఫ్లోరింగ్ అనుమానం వచ్చింది. ఎగుడు దిగుడుగా ఉన్న ఆ స్ధలంలో తవ్వి చూడగా రెండు అస్ధిపంజరాలు లభ్యమయ్యాయి. వాటిని మహిళ, ఆమె కుమార్తెగా గుర్తించారు. వాటిని DNA పరీక్ష కోసం పంపించారు.
చుట్టుపక్కల వారిని విచారించి షంషాద్ వివరాలు సేకరించారు. అతను తన స్వరాష్ట్రమైన బీహార్ పారిపోయినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని బీహార్ పంపినట్లు ముంబై సిటీ పోలీసు కమీషనర్ అఖిలేష్ నరేన్ సింగ్ చెప్పారు.