ప్రియుడి గదిలో ప్రియురాలు ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : November 28, 2020 / 12:24 PM IST
ప్రియుడి గదిలో ప్రియురాలు ఆత్మహత్య

Updated On : November 28, 2020 / 12:52 PM IST

girl hanging at boy friend room : పెళ్లి చేసుకునే విషయంలో ప్రియుడు, ప్రియురాలి మధ్య మాటామాటా పెరిగి ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాండురంగా నగర్ లో నివసించే నర్సింహులు కుమార్తె ప్రవీణ (17) వికారాబాద్ కు చెందిన శ్రీకాంత్ తో మూడేళ్లుగా ప్రేమలో ఉంది. శ్రీకాంత్ హైదర్ గూడ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.

ప్రవీణ తరచూ శ్రీకాంత్ రూమ్ కు వచ్చి వెళుతూ ఉండేది. గురువారం కూడా అలాగే వచ్చింది. మూడేళ్ల నుంచి ప్రేమించికుంటున్నాము కదా పెళ్లి చేసుకుందామని కోరింది. శ్రీకాంత్ కొన్నాళ్ళు ఆగి పెళ్లిచేసుకుందామని ఆమె ప్రపోజల్ ను వాయిదా వేశాడు. ఈవిషయంలో ఇద్దరూ కాసేపు గొడవ పడ్డారు.



https://10tv.in/wife-acid-attack-on-husband-kodada/
అనంతరం శ్రీకాంత్ ఆమెను గదిలో వదిలేసి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రవీణ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.