పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందని…. ఏకాంతంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాడు

అమ్మాయి తరుఫు వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారనే కోపంతో అంతకు ముందు ఆమెతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఒక యువకుడు. ముంబైలోని, మలాద్ శివారులోని, పఠావ్ వాడీ కి చెందిన ముర్తుజా ముస్తాలి వోహ్రాకు గతేడాది…. గుజరాత్ కు చెందిన 16 ఏళ్ల బాలికతో వివాహం నిశ్చయమయ్యింది.
https://10tv.in/madhya-pradesh-11-years-old-boy-pet-rat-dead-5th-class-girl-killd/
మతపరమైన కార్యక్రమంలో పాల్గోనేందుకు ఆ బాలిక జనవరిలో ముంబై వచ్చింది. అప్పటి నుంచి వోహ్రా ఆ బాలికతో మరింత చనువుగా ఉండటం మొదలెట్టాడు. తరచూ ఆబాలిక ఇంటికి వెళ్లి ఆమెతో శారీరకంగా కూడ దగ్గరయ్యాడు. లైంగికంగా చాలా సార్లు కలిశారు. అలాంటి సమయంలో బాలికకు తెలియకుండా సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలను వీడియో తీశాడు.
అనుకోని కారణాలతో ఇటీవల ఆ బాలిక తల్లి తండ్రులు గతంలో జరిగిన నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ఆమె కుటుంబం పరువు బజారుకీడ్చాలన్న కోపంతో బాలికతో సన్నిహితంగా ఉన్నో వీడియోలను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేశాడు.
వాటిని చూసిన బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. గుజరాత్ లోని వోహ్రాపై సూరత్ జిల్లా అత్వలైన్స్ పోలీసులు నిందితుడిపై ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు.