ఆమెకు 32, అతనికి 19 ఏళ్లు…. ప్రేమ పేరుతో ఏడాదికాలంగా అత్యాచారం

  • Published By: murthy ,Published On : September 4, 2020 / 06:56 PM IST
ఆమెకు 32, అతనికి 19 ఏళ్లు…. ప్రేమ పేరుతో ఏడాదికాలంగా అత్యాచారం

Updated On : September 4, 2020 / 7:38 PM IST

ఆమెకు 32 ఏళ్లు, అతనికి 19 ఏళ్లు…. వాళ్ల ప్రేమకు వయస్సు అడ్డురాలేదు. ప్రేమ పేరుతో శారీరకంగా కలవటానికి వయస్సు అడ్డు రాలేదు….కానీ పెళ్లి చేసుకోమనే సరికి మాత్రం కుర్రాడు ముఖం చాటేశాడు.

హైదరాబాద్ బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఎర్రకుంట లో నివాసం ఉండే యువకుడికి (19) అదే ప్రాంతానికి చెందిన పెళ్ళికాని యువతి(32)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమేపి ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. దీంతో ఇద్దరూ శారీరకంగా కలిసారు. పెళ్లి కాకుండానే ఏడాది కాలంగా స్వర్గ సుఖాలు అనుభవించారు. ఇటీవల ఆయువతి పెళ్లి చేసుకుందామని వత్తిడి చేయసాగింది.

ఆ యువకుడు పెళ్లికి నిరాకరించాడు. అప్పటి నుంచి ఆమెను తప్పించుకు తిరగసాగాడు. మోసపోయానని గ్రహించిన యువతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.