ఆధార్ పొందిన మయన్మార్ వ్యక్తి ని అరెస్టు  చేసిన పోలీసులు 

  • Published By: murthy ,Published On : August 12, 2020 / 08:58 AM IST
ఆధార్ పొందిన మయన్మార్ వ్యక్తి ని అరెస్టు  చేసిన పోలీసులు 

Updated On : August 12, 2020 / 9:07 AM IST

హైదరాబాద్ లో నివాసం ఉంటూ అక్రమంగా ఆధార్ కార్డు పొందిన మయన్మార్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని కిషన్ బాగ్ లో ఉంటున్న మహమ్మద్ ఖాదీర్(37) ఆధార్ కార్డ్ పొందాడు.

ఇతనికి కార్డు రావటానికి ఒక మీ సేవా కేంద్రం నిర్వాహకుడు సహాయ చేసినట్లు కనుగొన్నారు. ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వం బీపీఎల్ కుటుంబాలకు అందించే   అన్ని సహాయాలను పొందుతున్నాడు.

ఇలాంటి కేసులో గతంలో అరెస్టైన కొంత మంది వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖాదీర్ న్ అదుపులోకి తీసుకున్నారు. కేసు తదుపరి విచారణ నిమిత్తం బహుదూర్ పురా పోలీసులకు బదలాయించారు.