తుపాకీ పేలి సెక్యూరిటీ గార్డు మృతి

  • Published By: murthy ,Published On : November 1, 2020 / 11:51 AM IST
తుపాకీ పేలి సెక్యూరిటీ గార్డు మృతి

Updated On : November 1, 2020 / 12:38 PM IST

security guard died : సికింద్రాబాద్ లో ఒక బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు చేతిలోని తుపాకి పేలి ఆ వ్యక్తి మరణించాడు. రాణి గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న మధు అనే వ్యక్తి చేతిలోని తుపాకి ఆదివారం ఉదయం పేలింది.

మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తున్న సమయంలో తుపాకి పేలటంతో మధు అక్కడి కక్కడే మరణించాడు. మృతుడిది నల్గోండ జిల్లా బత్తులపాలెంగా గుర్తించారు.



విషయం తెలుసుకున్న మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మధు ఆత్మహత్య చేసుకున్నాడా ? గన్ మిస్ ఫైర్ అయ్యిందా అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది ?