వృధ్ధుడి నుంచి డబ్బులు చోరీ చేసిన మహిళలు అరెస్ట్

  • Published By: murthy ,Published On : October 23, 2020 / 02:11 PM IST
వృధ్ధుడి నుంచి డబ్బులు చోరీ చేసిన మహిళలు అరెస్ట్

Updated On : October 23, 2020 / 2:30 PM IST

Police two women arrested for robbing elderly man : బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి వెళుతున్న 62 ఏళ్ల వృధ్దుడి నుంచి డబ్బులు కాజేసిన ఇద్దరు మహిళలను దక్షిణ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 14వ తేదీన 62 ఏళ్ల వ్యక్తి టైగ్రి ప్రాంతంలోని ఒక బ్యాంకు నుంచి రూ.50 వేలు డబ్బులు డ్రాచేసి, లెక్క పెట్టుకుని ….సమీపంలోని ఆస్పత్రికి వెళ్లాడు.

బ్యాంకులో డబ్బులు డ్రా చేసి లెక్కపెట్టుకోవటం గమనించిన ఇద్దరు మహిళలు ఆ వృధ్దుడిని అనుసరించి ఆస్పత్రివద్ద అతని బ్యాగులోంచి నగదు కాజేసి పరారయ్యారు. డబ్బు పోయిన విషయంగమనించిన వృధ్దుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



సీసీటీవీ ఫుటేజి పరీశీలించిన పోలీసులు దొంగతనం చేసిన మహిళలను మధ్యప్రదేశ్ లోని రాజ్ ఘడ్ కు చెందిన రేణు(36) , జ్యోతి(34)లు గా గుర్తించారు. వీరిని గురువారం ఢిల్లీలోని పుష్పక్ విహార్ ఖోఖా మార్కెట్ లోని ఎన్ బీసీసీ ప్లాజా వద్ద అరెస్టు చేశారు.
https://10tv.in/delhi-elderly-couple-survives-by-selling-tea-with-broken-hands-and-broken-waist/
వారి వద్దనుంచిరూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీలో ముగ్గురు మహిళలు పాల్గోన్నారని… కాళీ అనే ఆ మహిళ తన వాటా చోరీ సొమ్ము తీసుకుని స్వస్ధలానికి వెళ్లిందని ఢిల్లీదక్షిణ పోలీసు కమీషనర్ అతుల్ కుమార్ చెప్పారు.