భర్తపై యాసిడ్ దాడి చేసిన భార్య

wife acid attack on husband, kodada : తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో భార్య, భర్తపై యాసిడ్ దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. జిల్లాలోని కోదాడ, శ్రీనివాస నగర్ లో నివాసం ఉండే నర్సింహరావు(50) భార్య లక్ష్మితో కలిసి నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం పెంచుకుంది.దీంతో శనివారం పొద్దున్న భర్త ముఖం మీద యాసిడ్ తో దాడిచేసింది. యాసిడ్ దాడిలో భర్త నరసింహారావు ముఖం మొత్తం కాలిపోవటంతో ఆయన గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరిగెత్తుకు వచ్చాడు. అతని అరుపులు విన్న స్ధానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.
https://10tv.in/young-man-commits-suicide-by-taking-selfie-video-in-hyderabad/