Minor Girl Kidnap : మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న మైనర్ బాలుడు

ప్రేమ వ్యామోహంలో పడిన ఒక మైనర్ బాలుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి పెళ్ళి చేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

Minor Girl Kidnap : మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న మైనర్ బాలుడు

Minors Arrested

Updated On : November 10, 2021 / 6:19 PM IST

Minor Girl Kidnap :  ప్రేమ వ్యామోహంలో పడిన ఒక మైనర్ బాలుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి పెళ్ళి చేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈరోడ్ జిల్లాలోని భవానీ తాలూకా ఒలగడం గ్రామంలో 10వతరగతి చదువుతున్న 15 ఏళ్ళ బాలికను వాళ్ల బంధువైన 17 ఏళ్ల బాలుడు కిడ్నాప్ చేసాడు.

రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటంతో బాలుడు ఇంటికి తరచుగా వస్తూ పోతూ ఉండేవాడు. దీంతో బాలిక తల్లితండ్రులకు ఎటువంటి అనుమానం రాలేదు. కాగా రెండురోజుల క్రితం తమ కుమార్తె కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు, పారిపోయిన ఇద్దరు మైనర్లను గుర్తించి గ్రామానికి తీసుకువచ్చారు. బాలికను తల్లితండ్రులకు అప్పగించారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

Also Read : Temple Hundi : చెప్పులు విప్పి గుడిలో హుండీ చోరీ చేసిన దొంగ

బాలికను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లిన మైనర్ బాలుడు, బాలికను వివాహం చేసుకున్నాడు. పోలీసులు బాలుడిపై పోక్సో చట్టంకింద కేసులు నమోదు చేసారు. అనంతరం జువైనల్ కోర్టలో హజరు పరుచగా… కోర్టు నిందితుడిని జువైనల్ హోమ్ కు తరలించింది.