Mahashivratri 2022 : గోదావరిలో స్నానానికి దిగి యువకుడు మృతి
తూర్పు గోదావరి జిల్లాలో శివరాత్రి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ద్రాక్షారామంలోని సప్త గోదావరిలో స్నానానికి దిగి ఒక యువకుడు మృతి చెందాడు.

mahashivaratri 2022
Mahashivratri 2022 : తూర్పు గోదావరి జిల్లాలో శివరాత్రి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ద్రాక్షారామం లోని సప్త గోదావరిలో స్నానానికి దిగి ఒక యువకుడు మృతి చెందాడు. మృతుడిని కాజులూరు మండలం కుయ్యేరు గ్రామానికి చెందిన కోట పురుషోత్తం(17)గా పోలీసులు గుర్తించారు.
రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో పని చేయటానికి 10 మంది యువకులు వచ్చారు. వారంతా ఈరోజు గోదావరిలో స్నానానికి వెళ్లారు. వారిలో పురుషోత్తంకి ఈత రాకపోవటంతో గోదావరిలో మునిగి మరణించాడు.
Also Read : Chittoor Home Guard : ఏడాది క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు మరో పెళ్లికి సిధ్దమైన హోం గార్డు
సమాచారం తెలుసుకున్న ద్రాక్షారామం పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రాపురం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.