మైనర్ బాలుడితో 21 ఏళ్ల మహిళ పెళ్లి.. పూజారితో సహా ముగ్గురి అరెస్ట్

మైనర్ బాలుడిని పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మహిళతో పాటు పూజారి సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని లూధియానాలో 21 ఏళ్ల మహిళతో ఆమె కంటే తక్కువ వయస్సు ఉన్న యువకుడితో వివాహం జరిపించారు. ఈ ఘటనతో గురుద్వార పూజారి, మరో ఇద్దరిపై కేసు నమోదు చేయాలని పంజాబ్, హర్యానా హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
ఇందిరా కాలనీ నివాసి ఈ యువకుడికి 19ఏళ్లు అని పోలీసులు వెల్లడించారు. కొన్ని నెలల క్రితమే యువకుడు బటాలాకు చెందిన మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయడం ఏర్పడింది. ఒకరికొకరు ఇష్టపడ్డారు.. ఇరువురి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదు… దాంతో ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. జూలై 23న గురువారం గురు తేగ్ బహదూర్ షా సాహిబ్ వద్ద పెళ్లి చేసుకున్నారు. అక్కడి పూజారి ఇందర్‌జిత్ సింగ్ వారి వివాహం చేశారు. ఇద్దరు సాక్షుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
మహిళ హైకోర్టును ఆశ్రయిస్తే.. :
వివాహం తరువాత.. ఆ మహిళ తనకు తన భర్తకు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. యువకుడికి 19ఏళ్ల వయస్సు ఉందని, అతడు మైనర్.. ఒక వ్యక్తికి చట్టబద్దమైన వయస్సు 21 ఏళ్లుగా ఉందని కోర్టు పేర్కొంది.. మైనర్ కు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని.. న్యాయమూర్తి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. బాల్య వివాహ నిషేధ చట్టం కింద పూజారి, ఇద్దరు సాక్షులపై పోలీసులు కేసు నమోదు చేశారు.