Uttar Pradesh : 28 ఏళ్లనాటి కేసులో పక్షవాతంతో ఉన్న 83 ఏళ్ల వ్యక్తికి కోర్టు నోటీసులు .. అరెస్ట్ తప్పదంటూ వార్నింగ్

83 ఏళ్ల వృద్ధుడికి అరెస్ట్ వారెంట్ తో నోటీసులు జారీ చేసింది కోర్టు. 28 ఏళ్లనటి కేసులో పక్షవాతంతో బాధపడుతు నడవలేకపోతున్న వ్యక్తికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టుకు రాకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చింది.

Uttar Pradesh : 28 ఏళ్లనాటి కేసులో పక్షవాతంతో ఉన్న 83 ఏళ్ల వ్యక్తికి కోర్టు నోటీసులు .. అరెస్ట్ తప్పదంటూ వార్నింగ్

83 year man receives arrest warrant

Updated On : June 29, 2023 / 6:38 PM IST

Uttar Pradesh Court : అతనో 83 ఏళ్ల వృద్ధుడు. పక్షవాతంతో బాధపడుతున్నాడు. మూలిగే నక్కమీద తాడిపండు పడినట్లుగా దాదాపు మూడు దశాబ్దాల క్రితం కేసు విషయంలో కోర్టునుంచి నోటీసులొచ్చాయి. నిర్ణయించిన గడువులో కోర్టులో హాజరుకావాలని లేదంటే అరెస్ట్ తప్పదని హెచ్చరించింది ధర్మాసనం. ప్రమాదవశాత్తు జరిగినదానికి ఇప్పటికీ బాధపడుతున్నా..పైగా పక్షవాతంతో ఉన్న 83 ఏళ్ల వృద్ధుడిని ఈ వయస్సులో నాకు నోటీసులా..? ఈ వయస్సులో అరెస్టా..? అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు ఉత్తరప్రదేశ్ లోని అచ్చన్ మియాన్న అనే వ్యక్తి.

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో నివాసం ఉంటున్నారు 83 ఏళ్ల వృద్ధుడు అచ్చన్ మియాన్. సోమవారం (జూన్ 26,2023) ఉదయం అతని ఇంటికి పోలీసులొచ్చారు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సమన్లు అందజేసారు. సమన్లు చూసి షాక్ అయ్యాడు. కోర్టుకు హాజరు కావాలని లేదంటే అరెస్ట్ చేస్తామని కోర్టు నోటీసుల్లో ఉన్న విషయాన్ని చెప్పారు.

Durgam Chinnaiah: జూబ్లీహిల్స్‌లో రోడ్డుపక్కన అపస్మారక స్థితిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు

ఈకేసు 1995 ఏళ్ల నాటిది. అంటే 28 ఏళ్ల క్రితానిది. అప్పుడు అచ్చన్ ఒక బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. డ్యూటీలో భాగంగా బరేలికి వెళ్లి..అక్కడనుంచి రాత్రి సమయంలో ఫరీద్‌పూర్‌కు వెళుతుండగా సడెన్ గా ఓ గేదె బస్సుకు అడ్డుగా వచ్చింది. బ్రేక్ వేసే సమయం కూడా లేదు అచ్చన్ కు. దీంతో బస్సు గేదెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గేదె మృతి చెందింది. దీంతో అచ్చన్ తనే స్వయంగా ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి విషయం చెప్పాడు. దీంతో అచ్చన్ మీద యాక్సిడెంట్‌ కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ ఇరవయ్యేళ్లలో అచ్చెన్ కు రెండు సార్లు సమన్లు అందాయి. పెరాలసిస్‌తో బాధపడుతుండటంతో బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా బెయిల్ మంజూరు అయ్యింది. ఆ తరువాత ఆకేసు విషయం ఏమైందో కూడా నాకు తెలీదు. కానీ మరోసారి తనకు కోర్టు సమన్లు జారీ చేయటంతో కోర్టులో హాజరుకాకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరింటంతో అచ్చెన్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకరి సహాయం ఉంటేనే అతి కష్టంమీద నడవగలుగుతున్నానని ఇటువంటి పరిస్థితుల్లో తనకు ఇలా అరెస్ట్ వారెంట్ నోటీసులేంటీ..? అని కంటతడిపెట్టుకుని వాపోతున్నారు.

Hyderabad Huge Scam : హైదరాబాద్ లో మరో భారీ మోసం.. రూ.40 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన ఐటీ