మేడ్చల్ చిన్నారి ఆద్య హత్య కేసులో నిందితుడికి 14 రోజులు రిమాండ్…చిన్నారి తల్లితో వివాహేతర సంబంధమే హత్యకు కారణం

  • Published By: bheemraj ,Published On : July 8, 2020 / 01:24 AM IST
మేడ్చల్ చిన్నారి ఆద్య హత్య కేసులో నిందితుడికి 14 రోజులు రిమాండ్…చిన్నారి తల్లితో వివాహేతర సంబంధమే హత్యకు కారణం

Updated On : July 8, 2020 / 10:30 AM IST

మేడ్చల్ లో చిన్నారి ఆద్య హత్య కేసులో నిందితుడు కరుణాకర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. వివాహేతర సంబంధమే ఆద్య హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు కరుణాకర్, అనూష గత కొంతకాలంగా చనువుగా ఉండేవారని, కరుణాకర్ తన స్నేహితులను అనూషకు పరిచయం చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. తన స్నేహితుడు రాజశేఖర్ తో అనూష చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన.. కరుణాకర్ జులై 2న సర్జికల్ బ్లేడుతో అనూష ఇంటికి వెళ్లాడు. అప్పటికే అనూష ఇంట్లో రాజశేఖర్ ఉండటంతో వారిని బయటికి రావాలన్నాడు.

కరుణాకర్ ను చూసి అనూష, రాజశేఖర్ బెడ్ రూమ్ లో దాచుకోవడంతో కరుణాకర్ అక్కడే ఉన్న అనూష కూతురు ఆద్య కూతురు గొంతు కోశాడు. అనంతరం రాజశేఖర్ పై దాడికి పాల్పడ్డాడు. తాను కూడా చనిపోవాలని కరుణాకర్ గొంతు, చెయ్యిపై చేసుకున్నాడు. అయితే కరుణాకర్ ను పోలీసులు ఉస్మానియాలో చేర్చి చికిత్స అందించారు. తర్వాత నిందితుడు కరుణాకర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కరుణాకర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడలో బేబి ఆద్యను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు కరుణాకర్ ను జులై 7, మంగళవారం జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించారు. ఆద్య హత్యకు ప్రదాన కారణం తల్లి అనూష..కరుణాకర్ తో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు.

అయితే 2018 ఏఎస్ రావు నగర్ యాపిల్ మొబైల్ షోరూంలో అనూషతో పరిచయం ఏర్పరచుకున్నారు. గత కొంతకాలంగా వీరి పరిచయం స్నేహంగా మారి చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదే తరహాలో అతని స్నేహితుడు కరుణాకర్ స్నేహితులు రవి, శ్రీను, చందు, రాజశేఖర్ ను అనూషకు పరిచయం చేశాడు. ఇక గత కొంతకాలంగా కరుణాకర్ ను పక్కకు పెట్టి అతని స్నేహితుడు రాజశేఖర్ తో అనూష చాలా చనువుగా ఉంటుంది. కరుణాకర్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ లు అన్నింటినీ కూడా బ్లాక్ చేసింది.

ఇక జులై 2న తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా తన పల్సర్ బైక్ పై సర్జికల్ బ్లేడుతో అనూష ఇంటికి కరుణాకర్ వెళ్లాడు. అప్పటివకే ఇంట్లో రాజశేఖర్ ఉండటం జీర్ణించుకోలేకపోయాడు. రాజశేఖర్ ను ఎట్టిపరిస్థితుల్లో బయటికి రావాలని చెప్పడంతో వెంటనే కరుణాకర్ వచ్చిన నేపథ్యంలో అనూష రాజశేఖర్ ను ఒక రూమ్ లో పెట్టి తాళం వేసింది. బాత్ రూమ్ లో అతన్ని దాచిపెట్టిన నేపథ్యంలో బయటికి తీసుకరావాలంటూ కూడా పక్కనే ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్ రూమ్ లో తన కూతురు ఉంది. వారు బయటికి రాకపోతే మాత్రం కూతురు ఆద్యను చంపుతానని బెదిరించాడు.

వారు బయటికి రాకపోవడంతో క్షణికావేశంలో ఒక్కసారిగా ఆద్య గొంతు కోసి చంపాడు. దీంతో బేబి ఆద్య అరుపులు, కేకలు వేయడంతో పక్కనే ఉన్న అనూష, రాజశేఖర్, బయటికి వచ్చారు. తర్వాత వెంటనే రాజశేఖర్ పై దాడి చేశాడు. కానీ రాజశేఖర్ అప్పటికే పరారు అయ్యారు. హత్య చేసిన అనంతరం కరుణాకర్ తన చేతి, గొంతును కో్సుకున్నాడు. అతన్ని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి, జులై 7 చరపల్లి జైలుకు తరలించారు.

Read Here>>కొత్త టీం రెడీ చేసుకుంటున్న బండి సంజయ్.. పార్టీ విధానాల్లోనూ మార్పులు