Uttarakhand: ఇంతకంటే దారుణం చూసి ఉండరు.. మహిళను పళ్లతో శరీరమంతా కొరికి, హత్య చేసి ఆ తర్వాత ఆమెపై అత్యాచారం

ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో తాను రైల్వే స్టేషన్‌ సమీపంలో మద్యం సేవిస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. అక్కడ మద్యం సేవిస్తున్న మహిళను కూడా చూశాడు. మహిళతో మాట్లాడి భోజనం చేస్తానని చెప్పి టెంపోలో తన గదికి తీసుకొచ్చాడు.

Uttarakhand: ఇంతకంటే దారుణం చూసి ఉండరు.. మహిళను పళ్లతో శరీరమంతా కొరికి, హత్య చేసి ఆ తర్వాత ఆమెపై అత్యాచారం

Hathibarkala: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హతిబర్కలాలో కేబినెట్ మంత్రి నివాసం సమీపంలో జరిగిన మహిళ దారుణ హత్యను పోలీసులు ఛేదించారు. మద్యం సేవించిన నిందితులు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారని, మహిళ ప్రతిఘటించడంతో నిందితుడు ఆమె తలను గోడకు కొట్టాడని పోలీసులు తెలిపారు. ఇందులో దారుణ కోణం ఏంటంటే.. ఆమె మరణించిన తర్వాత నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న చెత్తకుప్పలో విసిరి సంఘటనను రోడ్డు ప్రమాదంగా చూపించాడని వెల్లడించారు. కాగా, ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలించారు.

Bihar: అంత్యక్రియలు చేసిన 7 సంవత్సరాలకు తిరిగొచ్చిన కొడుకు.. ఒక్కసారిగా చూసి అందరూ షాక్

ఎస్‌ఎస్‌పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సరితా దోవల్‌ మాట్లాడుతూ.. ‘‘సోమవారం ఉదయం సెంట్రియో మాల్‌ సమీపంలో రోడ్డు పక్కన ఓ మహిళ మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న సిటీ కొత్వాల్ రాకేష్ గుసేన్, దలాన్‌వాలా కొత్వాలి ఇన్‌స్పెక్టర్ రాజేష్ సాహ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని రోడ్డు పక్కన ఈడ్చుకెళ్లిన గుర్తులు ఉన్నాయి. ఆ విధంగా పోలీసులు ఒక గుడిసె వద్దకు చేరుకున్నారు. అక్కడ గది మొత్తం రక్తంతో తడిసిపోయింది. గుడిసెలో నివసిస్తున్న బడిఘాట్ రాజ్‌పూర్‌కు చెందిన నిందితుడు రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పాటు సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా నిందితుడు మృతదేహాన్ని ఈడ్చుకెళ్లినట్లు కనిపించింది.

Madhya Pradesh: బీజేపీ పాలిత రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. హిందూ మతం స్వీకరించిన 190 మంది ముస్లింలు

ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో తాను రైల్వే స్టేషన్‌ సమీపంలో మద్యం సేవిస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. అక్కడ మద్యం సేవిస్తున్న మహిళను కూడా చూశాడు. మహిళతో మాట్లాడి భోజనం చేస్తానని చెప్పి టెంపోలో తన గదికి తీసుకొచ్చాడు. ఇక్కడ వారిద్దరూ మరోసారి మద్యం సేవించి మహిళపై అత్యాచారానికి యత్నించగా, మహిళ ప్రతిఘటించి ముఖంపై కొరికింది. మద్యం మత్తులో ఉన్న నిందితుడు ముందుగా మహిళ శరీరం మొత్తాన్ని పళ్లతో కొరికాడు. ఆవేశంతో నిందితుడు తలను గోడకు కొట్టాడు. మహిళ మృతి చెందిన తర్వాత ఆమెపై అత్యాచారం చేసి తన గదిలో ఉన్న చిన్న సిలిండర్‌తో ఆమె తలపై కొట్టాడు. రాత్రి 3-4 గంటల సమయంలో అతన్ని బయటకు లాగి రోడ్డు పక్కన పడేసి తన గదిలోకి వెళ్లిపోయాడు’’ అని తెలిపారు.

Monu Manesar: ఎవరు ఈ మోను మానేసర్..? గురుగ్రామ్‭ హింసకు సూత్రధారి అయిన ఇతడి గత చరిత్ర తెలుసా?

మృతురాలు నలపాణి వాసి అని ఎస్పీ తెలిపారు. భర్త కూలీ పనులు చేసుకుంటూ ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఆమె గత 12 సంవత్సరాలుగా డెహ్రాడూన్‌లో నివసిస్తోందట. ఆమె మద్యానికి బానిసైంది. అలా ఒక్కోసారి రాత్రిళ్లు ఇంటికి రాకుండా ఉండడం జరుగుతూ ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా నిందితుడు రాజేష్ అవివాహితుడు. మున్సిపాలిటీలో పని చేస్తున్నాడు. రాజేష్‌కు చేయి విరగడంతో హతిబర్కలాలోని సులభ్ టాయిలెట్ ఉద్యోగి అతడిని పనిలో పెట్టుకున్నాడు.