Gang Offer: ‘మహిళను గర్భవతిని చేయాలి.. అలా చేస్తే రూ.13 లక్షలు ఇస్తాం’ అంటూ..

‘మాకు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ అనే కంపెనీ ఉంది. పిల్లలు లేని మహిళలు మమ్మల్ని సంప్రదిస్తారు.. మేము మిమ్మల్ని‘ అంటూ..

Gang Offer: ‘మహిళను గర్భవతిని చేయాలి.. అలా చేస్తే రూ.13 లక్షలు ఇస్తాం’ అంటూ..

pregnant women

Updated On : January 1, 2024 / 6:48 PM IST

‘మాకు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ అనే కంపెనీ ఉంది. పిల్లలు లేని మహిళలు మమ్మల్ని సంప్రదిస్తారు.. మేము మిమ్మల్ని వారి వద్దకు పంపిస్తాం. మహిళను గర్భవతిని చేయాలి.. అలా చేస్తే రూ.13 లక్షలు మీకు ఇస్తాం’ అంటూ సామాజిక మాధ్యమాలే వేదికగా మోసాలకు పాల్పడింది ఓ ముఠా.

పురుషులకు మహిళలు, డబ్బుల ఆశ చూపి తమ ఊబిలోకి లాగుతున్నారు. మహిళలను గర్భవతులను చేసి, వారికి పిల్లలు కలిగే భాగ్యాన్ని ప్రసాదించే ఆసక్తి ఉంటే పేర్లు రిజిస్ట్రర్ చేసుకోవాలని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.799 ఇవ్వాలని అంటారు.

ఎవరైనా మహిళలను గర్భవతులను చేసే అవకాశంతో పాటు డబ్బు కూడా ఇస్తున్నారని ఆశపడి కొందరు పురుషులు పేర్లు నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రర్ చేసుకున్న పురుషులకు కొందరు మహిళల ఫొటోను పంపుతున్నారు మోసగాళ్లు. ఆ ఫోటోల్లో నుంచి ఓ మహిళను ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు.

అనంతరం రూ.5,000-రూ.20,000 మధ్య జమ చేయమని పురుషులకు సూచిస్తున్నారు. డబ్బు మొత్తం కట్టాక మహిళ వద్దకు పంపుతామని చెబుతున్నారు. ఆశ పడి చాలా మంది డబ్బు కట్టారు. ఆ తర్వాత వారికి ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ నుంచి స్పందన రాలేదు. అప్పుడుగానీ తెలియరాలేదు తమను ఆశపెట్టి మోసం చేశారని.

ఈ రాకెట్‌ను బిహార్ పోలీసులు తాజాగా ఛేదించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు సేకరించి, చివరకు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. మహిళను గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు, ఒకవేళ ఆ ప్రక్రియలో విఫలమైనా రూ.5 లక్షలు ఇస్తామని మోసగాళ్లు చెప్పారని పోలీసులు వివరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కొందరు ఇలాంటి మోసాలకే పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

విశాఖలో దారుణం.. బాలికపై 10మంది లైంగిక దాడి, 2రోజులు నిర్బంధించి చిత్రహింసలు..మహిళా కమిషన్ సీరియస్